Begin typing your search above and press return to search.

దేవర తర్వాత కొరటాల ప్లాన్ ఏంటి..?

ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.

By:  Tupaki Desk   |   3 Jun 2025 3:00 AM
దేవర తర్వాత కొరటాల ప్లాన్ ఏంటి..?
X

ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. దేవర 1 అంచనాలను అందుకోవడంలో దర్శకుడిగా తన ప్రతిభ చాటాడు. ఐతే దేవర పార్ట్ 1 విషయంలో కొంతమంది ఆడియన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తపరిచినా కమర్షియల్ గా సినిమా చేసిన కలెక్షన్స్ చూసి సాటిస్ఫై అయ్యారు. ఐతే నెక్స్ట్ దేవర 2 మీద తన పూర్తి ఫోకస్ పెట్టాడు కొరటాల శివ. దేవర 1 లో జరిగిన తప్పులను గుర్తించి వాటిని రిపీట్ చేయకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తి చేశాకే దేవర 2 సెట్స్ మీదకు వెళ్తుంది. వార్ 2 ఆల్రెడీ పూర్తి కాగా ఈ ఆగష్టుకి రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మరో ఏడాది దాకా పట్టేలా ఉంది. ఈలోగా దేవర 2 స్క్రిప్ట్ దశ నుంచి పకడ్బందీగా ఉంచాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.

దేవర 2 నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఐతే ఆ సినిమాను అనుకున్న టైం లో పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. దేవర 2 తర్వాత కొరటాల శివ ప్లానింగ్ ఏంటన్నది తెలియలేదు. శివ డైరెక్షన్ లో సినిమాలు చేయాలని స్టార్స్ ఆసక్తిగా ఉన్నారు. కొరటాల శివ నెక్స్ట్ సినిమాల లిస్ట్ లో హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసి మళ్లీ కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గారు. ఆ కాంబినేషన్ తర్వాత సెట్ అవుతుందని అంటున్నారు. చరణ్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్.

బాహుబలి ప్రభాస్ తో మిర్చి లాంటి హిట్ కొట్టిన కొరటాల శివ మరో భారీ సినిమా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. ఈసారి ప్రభాస్ ఇమేజ్ కి తగినట్టుగా అదిరిపోయే కథతో రాబోతున్నాడట. దేవర 2 పూర్తయ్యాక కొరటాల శివ నెక్స్ట్ హీరో ఎవరన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఐతే ప్రస్తుతం మన స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక డైరెక్టర్ సినిమా అనుకున్నా కూడా అతను కమిటైన సినిమాలు చేసే వరకు వెయిట్ చేయక తప్పట్లేదు.