Begin typing your search above and press return to search.

కొరటాల.. ఇక వెయిటింగ్ తప్పదా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి అందరికీ తెలిసిందే. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ, మాటలు అందించి మెప్పించారు.

By:  Tupaki Desk   |   2 July 2025 4:52 AM
కొరటాల.. ఇక వెయిటింగ్ తప్పదా?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి అందరికీ తెలిసిందే. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ, మాటలు అందించి మెప్పించారు. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టి.. తక్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరారు. ఇప్పటికే వివిధ సినిమాలను తీసి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు.

మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో ఆడియన్స్ ను రేంజ్ లో మెప్పించారు. తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలకు తనదైన శైలిలో సందేశాన్ని జోడిస్తూ ఎంతో మందికి ఫేవరెట్ డైరెక్టర్ గా మారారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆచార్యతో తీవ్రంగా నిరాశపరిచారు.

కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీతో హిట్ ను అందుకున్నారు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కమ్ బ్యాక్ ఇచ్చారు. 2024లో రిలీజ్ అయిన మూవీల్లో దేవర అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అలా దేవరతో మరోసారి అలరించిన కొరటాల.. ఇప్పటి వరకు కొత్త సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేకపోయారు.

దేవర వచ్చి చాలు నెలలు అవుతున్నా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. నిజానికి కొరటాల ఇప్పుడు దేవర-2పై వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తారక్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన బాలీవుడ్ డెబ్యూ వార్-2ను కంప్లీట్ చేసిన ఆయన.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఆ తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు గాను ప్రిపేర్ కూడా అవుతున్నారు. అందుకే ఆయన దేవర-2ను మొదలుపెట్టడానికి చాలా సమయం పడుతుందని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో దేవర సీక్వెల్ ఆలస్యమవుతుందని, కొరటాలకు ఇంకా వెయిటింగ్ తప్పదని అర్థమవుతుంది.

అయితే అలా అని కొరటాల.. వేరే హీరోతో సినిమా చేద్దామనుకున్నా ఎవరూ ఖాళీగా లేరు. తమ తమ లైనప్స్ లోని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బడా హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అంతా ఇతర కమిట్మెంట్స్ తో ఉన్నారు. కాబట్టి కొరటాల మరో హీరోతో తీద్దామనుకున్నా కష్టమే. మరి తన అప్ కమింగ్ మూవీ విషయంలో కొరటాల శివ ఏం చేస్తారో వేచి చూడాలి.