Begin typing your search above and press return to search.

కోలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ దారిలోకి వ‌చ్చిన‌ట్లే!

టాలీవుడ్ హీరోలెవ‌రూ స్ట్రెయిట్ కోలీవుడ్ చిత్రాల్లో న‌టించింది లేదు. ఎంతో మంది బిగ్ స్టార్స్ఉన్నా? టాలీవుడ్ నుంచే అప్పుడ‌ప్పుడు అటెంప్ట్ చేసారు త‌ప్ప నేరుగా త‌మిళ‌నాడు కెళ్లి న‌టించింది లేదు.

By:  Srikanth Kontham   |   4 March 2026 9:22 AM IST
కోలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ దారిలోకి వ‌చ్చిన‌ట్లే!
X

టాలీవుడ్ హీరోలెవ‌రూ స్ట్రెయిట్ కోలీవుడ్ చిత్రాల్లో న‌టించింది లేదు. ఎంతో మంది బిగ్ స్టార్స్ఉన్నా? టాలీవుడ్ నుంచే అప్పుడ‌ప్పుడు అటెంప్ట్ చేసారు త‌ప్ప నేరుగా త‌మిళ‌నాడు కెళ్లి న‌టించింది లేదు. కానీ కోలీవుడ్ హీరోలు మాత్రం టాలీవుడ్ కి దిగొచ్చి మ‌రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌త్తా చాటిన త‌ర్వాత టాలీవుడ్ లో మార్కెట్ కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలే చేసారు. అప్ప‌టి వ‌ర‌కూ విజ‌య్, ధ‌నుష్, సూర్య‌, కార్తీ న‌టించిన సినిమాలు తెలుగులోకి అనువాదం మాత్ర‌మే అయ్యేవి. ఆ ర‌కంగా త‌మ‌కంటూ కొంత ఫ్యాన్ బేస్ ఏర్ప‌రుచుకున్నారు.

కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టిన త‌ర్వాత స‌న్నివేశం మారింది. తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వ‌డం మొద‌లైంది. ధ‌నుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కించిన `కుభేర` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా మంచి విజ‌యాన్ని అందు కుంది. అంత‌కు ముందు వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో `సార్` చిత్రంలోనూ ధ‌నుష్ హీరోగా న‌టించి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇలా రెండు తెలుగు సినిమాలు ధ‌నుష్ టాలీవుడ్ ఇమేజ్ ను రెట్టింపు చేసాయి.

అలాగే ద‌ళ‌ప‌తి విజ‌య్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `వార‌సుడు` సినిమాతో టాలీవుడ్లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ కాన్సెప్ట్ కు ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ బాగానే క‌నెక్ట్ అయ్యారు. విజ‌య్ పొలిటిక‌ల్ గా కెరీర్ ని ప్లాన్ చేసుకోవ‌డంతో సీరియ‌స్ గా అటు వైపు ఆలోచ‌న చేస్తున్నాడు? టాలీవుడ్ సినిమాలే టార్గెట్ గా పెట్టుకుంటే ఇక్క‌డా పెద్ద స్టార్ గా ఎదిగేవారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే శివ‌కార్తికేయ‌న్ `ప్రిన్స్` సినిమాతో టాలీవుడ్లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.

అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా పెద్ద‌గా వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. కానీ శివ‌కార్తికేయ‌న్ ఓ ఐడెంటిటీ వేయ‌గ‌లిగాడు. కార్తీ కూడా వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఊపిరి` సినిమాతో తెలుగులో లాంచ్ అయ్యాడు. అప్ప‌టికే కార్తీ అంటే? తెలుగులో ప్ర‌త్యేక‌మైన అభిమానం ఏర్ప‌డింది. `ఊపిరి` త‌ర్వాత అదే అభిమానం రెట్టింపు అయింది. రవికుమార్ చౌదరి చాలా కాలం క్రితమే విక్రమ్ హీరోగా 'నైన్' అనే సినిమా చేసారు. కానీ ఇది పెద్ద‌గా ఆడ‌లేదు.

తాజాగా సూర్య కూడా టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `విశ్వ‌నాధ్ అండ్ స‌న్స్` చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. టైటిల్ తోనే సినిమాపై బ‌జ్ నెల‌కొంది. ఓ డీసెంట్ ఫ్యామిలీ స్టోరీతో సూర్య అల‌రించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అవ‌కాశం వ‌స్తే మ‌రింత మంది త‌మిళ హీరోలు తెలుగు సినిమాలు చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. అలాగే టెక్నిషియ‌న్లు కూడా ఇక్క‌డ హీరోల‌తో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఒక‌ప్పుడు ప‌రిస్థితుల‌కు పూర్తి భిన్నంగా కోలీవుడ్ క‌నిపిస్తోంది. మునుప‌టి కంటే తెలుగు న‌టుల‌కు అక్క‌డా ఆద‌ర‌ణ పెరిగింది.