Begin typing your search above and press return to search.

టైగ‌ర్ తో కియారా ఫైటింగులా!

మ‌రి స్పై థ్రిల్ల‌ర్ లో తార‌క్ ఒక్క‌డా? ఇద్ద‌రా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మ‌రో లీడ్ పాత్ర‌లో కియారా అద్వాణీని కూడా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 6:50 AM GMT
టైగ‌ర్ తో కియారా ఫైటింగులా!
X

ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'వార్ -2' టీమ్ తో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న అభిమానులంద‌రిలో త‌న ప్ర‌వేశంతో మ‌రింత జోష్ నింపాడు. తార‌క్ ఎక్క‌డ ఉంటే? అక్క‌డ స‌ర‌దాగా ఉంటాడు? అనే టాక్ ఉంది. 'వార్ -2' టీమ్ తో ఇప్పుడే జాయిన్ అయ్యాడు కాబ‌ట్టి మింగిల్ అవ్వ‌డానికి కొన్ని నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టివ‌ర‌కూ తార‌క్ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుని రావ‌డ‌మే క‌నిపిస్తుంది.

ఇందులో తార‌క్ ద్విపాత్రాభిన‌యం అని వినిపిస్తుంది. ఒక‌టి పాజిటివ్ రోల్ అయితే మ‌రొక‌టి నెగిటివ్ గా ఉంటుంద‌ని..అది హృతిక్ ని ఢీకొట్టే బ‌ల‌మైన విల‌న్ పాత్ర అని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి స్పై థ్రిల్ల‌ర్ లో తార‌క్ ఒక్క‌డా? ఇద్ద‌రా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మ‌రో లీడ్ పాత్ర‌లో కియారా అద్వాణీని కూడా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె కూడా 'వార్ -2' సెట్స్ కి వెళ్ల‌లేదు. 'గేమ్ ఛేంజ‌ర్' షూట్ లో బిజీ అయింది. అయితే తాజాగా ఆమె సైతం అంటూ యుద్దానికి దిగ‌బోతుంది.

ప్ర‌స్తుతం కియారా యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆమెపై కీల‌క యాక్ష‌న్ ఎపిసోడ్లు కొన్ని చిత్రీక‌రించనున్నారుట‌. దీనిలో భాగంగా ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ అవ‌స‌రం ప‌డ‌టంతో శిక్ష‌ణ‌కు పంపిన‌ట్లు తెలుస్తోంది. మే 1 నుంచి కియారా కూడా రెగ్యుల‌ర్ గా షూటింగ్ కి హాజ‌రవుతుంద‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి లీకైంది. కియారా త‌ల‌ప‌డేది? టైగ‌ర్ తోన‌ని ముంబై వ‌ర్గాలంటున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయ‌ని..అవి త‌గ్గాఫ్ వార్ గా ఉంటాయ‌ని లీకులందుతున్నాయి.

ఈ స‌న్నివేశాల్ని రాజ‌స్థాన్ ఎడారిలో చిత్రీక‌రించ‌నున్నారుట‌. ఆ షూట్ కి సంబంధించి ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేస్తున్నారుట‌. వాటిలో ఎక్క‌డా హృతిక్ రోష‌న్ క‌నిపించ‌డుట‌. కేవ‌లం తార‌క్-కియారా మ‌ధ్య మాత్ర‌మే చోటు చేసుకునే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంతో? తెలియాల్సి ఉంది. మ‌రోవైపు ఎండ‌ల‌తో తీవ్ర‌మైన ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతోన్న వేళ రాజ‌స్తాన్ లో షూట్ అంటే? ఇంకెంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రానికి ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.