పూజా హెగ్దే వర్సెస్ కియరా అద్వాని..?
వార్ 2 లో కియరా గ్లామర్ షో ఆడియన్స్ కి నిద్రపోనివ్వదు అనిపించేలా ఉంది. మరోపక్క రజినీకాంత్ కూలీ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే గ్లామర్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది.
By: Tupaki Desk | 12 July 2025 6:56 PM ISTతెర మీద గ్లామర్ షో చేసే అందాల భామలు తమకు వచ్చిన ఈ ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలని ఫిక్స్ అవుతారు. ఆల్రెడీ తమకున్న ఒక గ్లామర్ ఇమేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వారు చేసే సినిమాల్లో స్పెషల్ గా కనిపించాలని.. గ్లామర్ తో అదరగొట్టాలని చూస్తారు. ఐతే లేటెస్ట్ గా ఇద్దరు అందాల భామలు ఒకేసారి తమ గ్లామర్ తో మెప్పించాలని చూస్తున్నారు. ఒకేరోజు రిలీజ్ అవుతున్న రెండు సినిమాల్లో ఇద్దరు భామల స్కిన్ షో హంగామా స్పెషల్ డిస్కషన్ గా మారింది.
ఆగష్టు 14న వెండితెర మీదకు రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ కాగా మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేస్తున్న వార్ 2. ఈ రెండు సినిమాలు దేనికదే ప్రత్యేకం అనిపించేలా ఉన్నాయి. వార్ 2 లో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే కియరా బికిని షో నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది.
వార్ 2 లో కియరా గ్లామర్ షో ఆడియన్స్ కి నిద్రపోనివ్వదు అనిపించేలా ఉంది. మరోపక్క రజినీకాంత్ కూలీ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే గ్లామర్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. కూలీ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేసింది. మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా కూలీ ప్రమోషన్స్ మాత్రం పూజా హెగ్దే సాంగ్ తో మొదలు పెట్టారు. మోనికా అంటూ వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
మోనికా సాంగ్ లో పూజా హెగ్దే రెడ్ అవ్ట్ ఫిట్ లో అందాల రచ్చ చేస్తుంది. సో కూలీలో పూజా హెగ్దే, వార్ 2 లో కియరా అద్వాని ఇద్దరు కూడా గ్లామర్ షోతో ఆడియన్స్ కి మంచి స్టఫ్ ఇచ్చేలా ఉన్నారు. పూజా హెగ్దేకి ఆల్రెడీ సౌత్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు థై షో చేసిన సినిమా మాక్సిమం వర్క్ అవుట్ అయ్యింది. సో తప్పకుండా పూజా బేబ్ కి కూలీ కలిసి వచ్చేలా ఉంది.
ఇక వార్ 2 కోసం కియరా కూడా అదరగొట్టేసిందని టాక్. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది సినిమా ప్రమోషన్స్ కి రాలేదు కానీ సినిమాలో కియదా గ్లామర్ షోతో ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. ఈ ఇద్దరు చేసిన స్కిన్ షోతో సినిమాకు ఎంతో కొంత మైలేజ్ వచ్చేలా చేస్తారని చెప్పొచ్చు.
