Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ సినిమాలకు బ్రేక్..!

ఐతే కియరా జస్ట్ పెళ్లి మాత్రమే చేసుకుంది ఇంకా పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోలేదని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2025 7:30 PM
స్టార్ హీరోయిన్ సినిమాలకు బ్రేక్..!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వాని బిఫోర్ మ్యారేజ్ వరకు సూపర్ ఫాం లో ఉంది. 2023 ఫిబ్రవరిలో సిద్ధార్థ్ తో పెళ్లి తర్వాత కెరీర్ లో దూకుడు తగ్గించింది కియరా. పెళ్లైతే అవకాశాలు తగ్గుతాయి అన్నది ఇదివరకు మాట ఇప్పుడు పెళ్లైనా పిల్లలు ఉన్నా సరే టాలెంట్ కి ఏది అడ్డు రావట్లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ పెళ్లై పిల్లలు ఉన్నా కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. అలియా భట్, దీపిక దీనికి ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు.

ఐతే కియరా జస్ట్ పెళ్లి మాత్రమే చేసుకుంది ఇంకా పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా అయ్యింది. ప్రస్తుతం కియరా ప్రెగ్నన్సీ గా ఉంది. సో ఈ టైం లో సినిమాలు చేయడం కష్టం. ప్రస్తుతం ఆమె ఎన్ టీ ఆర్, హృతిక్ రోషన్ చేస్తున్న వార్ 2 లో నటిస్తుంది. ఆ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అనుకున్నారు. మరి అనుకున్న టైం కు రిలీజ్ అవుతుందా అన్నది చెప్పడం కష్టం. కియరా పోర్షన్ పూర్తై ఉంటే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది కానీ కియరా కి సంబంధించిన సీన్స్ పెండింగ్ ఉంటే మాత్రం సినిమా ఆ టైం కి పూర్తి చేయడం కష్టం.

ఈమధ్యనే కియరా ఒక ఈవెంట్ కి బేబీ బంప్ తో వచ్చింది. సో కియరా డెలివరీ అయ్యాక ఎలా లేదన్నా ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా టైం కావాలంటే ఒక ఏడాది టైం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కియరా ఈ ఏడాది పాటు సినిమాలు చేసే ఛాన్స్ లేదు. వార్ 2 తో పాటు అమ్మడు కె.జి.ఎఫ్ టాక్సిక్ లో కూడా నటిస్తుంది. సో కియరా బ్రేక్ తీసుకుంటే కచ్చితంగా ఆ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది.

టాక్సిక్ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. మరి కియరా ఈలోగా ఆ షూటింగ్ కి సహకరిస్తుందా లేదా అన్నది చూడాలి. బాలీవుడ్ లో కూడా వార్ 2 తప్ప కియరా వేరే ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ఐతే అసలే అవకాశాలు లేని ఈ టైం లో కియరా ఈ బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి అయినా ఆమె కెరీర్ మీద కచ్చితంగా ఇంపాక్ట్ పడేలా చేస్తుందని అనిపిస్తుంది. మరి కియరా మళ్లీ బ్రేక్ తర్వాత కంబ్యాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.