796లో కీర్తి సురేష్‌కి చోటు..!
'మహానటి' ఫేం కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన హిందీలో ఆఫర్లను సొంతం చేసుకుంటూనే ఉంది.
By: Tupaki Desk | 23 April 2025 10:30 AM'మహానటి' ఫేం కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన హిందీలో ఆఫర్లను సొంతం చేసుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఒక హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం రెండు హిందీ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు తమిళంలోనూ కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడంతో ఆమె అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఎట్టకేలకు కీర్తి సురేష్ తెలుగు సినిమాలో కనిపించబోతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోతున్న తెలుగు - తమిళ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్థిక నేరాలకు సంబంధించిన కథతో ఆ సినిమాను రూపొందించిన వెంకీ అట్లూరి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించిన ఆ సినిమా తెలుగు, తమిళ్, మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ వర్షన్‌కి ఓటీటీలో మంచి స్పందన దక్కింది. అందుకే వెంకీ అట్లూరి తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాస్త గ్యాప్ తీసుకున్న వెంకీ అట్లూరి తదుపరి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ సినిమా ఉండబోతుంది.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ద్వి భాష చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమాకు '796 సీసీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మారుతి కార్ల కంపెనీ భారతదేశంకు రావడం వెనుక జరిగిన ఒక ఆసక్తికర కథాంశంను ఈ సినిమాతో దర్శకుడు చూపించబోతున్నాడు. 796 సీసీ అనేది మారుతి కారు ఇంజన్ కెపాసిటీని చూపిస్తుందని సమాచారం అందుతోంది. సూర్య గతంలో ఆకాశమే నీ హద్దురా అనే బయోపిక్‌ను చేశాడు. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి బయోపిక్ కాకుండా వాస్తవ ఘటనలను తీసుకుని కల్పిత పాత్రలతో, కల్పిత సన్నివేశాలతో రూపొందించబోతున్నారట.
ఈ సినిమాలో సూర్యకు జోడీగా కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. గతంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించింది. వీరిద్దరి కాంబోలో రంగ్ దే సినిమా వచ్చింది. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. అయినా మరోసారి కీర్తి సురేష్ తో వర్క్ చేసేందుకు వెంకీ అట్లూరి ఆసక్తి కనబర్చాడు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. సూర్య మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో తమిళ్ హీరోలు ఇలా ద్వి భాషా చిత్రాలు చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. కనుక 796 సీసీతో సూర్య, కీర్తి సురేష్‌లు విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.