Begin typing your search above and press return to search.

ఈ యంగ్ హీరో ర‌వితేజ కోసం వ‌చ్చాడా?

తాజాగా యువ న‌టుడు కార్తీక్ ర‌త్నం త‌న‌కి స్పూర్తి ఎవ‌రో రివీల్ చేసారు. అత‌ను మాస్ రాజా ర‌వితేజ స్పూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాడుట‌.

By:  Tupaki Desk   |   13 Sep 2023 1:30 PM GMT
ఈ యంగ్  హీరో ర‌వితేజ కోసం వ‌చ్చాడా?
X

కొత్త‌గా ఇండ‌స్ట్రీకి వచ్చే ఎవ‌రికైనా స్పూర్తి ఎవ‌రంటే? మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు. ర‌తితేజ ..నాని ల నుంచి మొన్న‌టి కార్తికేయ గుమ్మ‌డికొండ వ‌ర‌కూ అంతా చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి వ‌చ్చి ఎదిగిన వారే. మెగాస్టార్ ముందు త‌రం న‌టుడైనా నేటి త‌రంకి కూడా ఆద‌ర్శంగా నిలుస్తున్నారంటే? కార‌ణం ఆయ‌న ఎదిగిన విధానం. ఇండ‌స్ట్రీలో ఎదిగిన వారంతా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. ఎదిగిన వారి ల‌గ్జ‌రీ లైఫ్ వెనుక ఎన్నో క‌ష్టాలు..క‌న్నీళ్లు ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం

అందుకే ఎదిగిన ప్ర‌తీ న‌టుడు ఏదో ద‌శ‌లో త‌న స్ట్ర‌గుల్ని రివీల్ చేస్తుంటారు. ఇలాంటివి మ‌రింత మందికి స్పూర్తిదాయ‌కంగా అనిపిస్తాయి. తాజాగా యువ న‌టుడు కార్తీక్ ర‌త్నం త‌న‌కి స్పూర్తి ఎవ‌రో రివీల్ చేసారు. అత‌ను మాస్ రాజా ర‌వితేజ స్పూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాడుట‌. ర‌వితేజ‌ని దూరం నుంచి చూస్తే చాలు అనుకున్నాడుట‌. ఇప్పుడు ర‌వితేజ బ్యాన‌ర్లోనే కార్తీక్ ర‌త్నం సినిమా చేస్తున్నాడు. 'అదే ఛాంగురే బంగారు రాజా'.

త్వ‌ర‌లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారంలో భాగంగా ఈ విష‌యాన్ని రివీల్ చేసాడు. 'కేరాఫ్ కంచ‌ర‌ల‌పాలెం' సినిమా త‌ర్వాత కూడా ర‌వితేజ‌ని ద‌గ్గ‌ర నుంచి చేసే ప్ర‌య‌త్నం చేసి ఓ ఫోటో తీసుకున్నా. ఇప్పుడు ఆయ‌న నిర్మాణంలో ఓ సినిమా చేయ‌డం అన్న‌ది గొప్ప అనుభూతినిస్తుంది. ప‌దేళ్ల వ‌య‌సులో రంగ‌స్థ‌లంపై కి అడుగుపెట్టా. వంద‌కి పైగా ప్ర‌దర్శ‌న‌లు ఇచ్చా. చిన్న‌ప్పుడు తొలి నాట‌కానికి నంది పుర‌స్కారం వచ్చింది.

సినిమాల్లో న‌టించాల‌ని ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన‌వాడిని. హీరోగానే కాకుండా న‌చ్చిన పాత్ర‌ల‌న్నింటికీ ఒకే చెప్పి ప్ర‌యాణం సాగిస్తున్నా. తొలిసారి పూర్తి స్థాయి హీరోగా చేసిన మొద‌టి సినిమా ఇదే. ర‌వితేజ స‌ర్ సినిమా చూసారు. ఆయ‌న‌కి బాగా న‌చ్చింది. నీది భిన్న‌మైన టైమింగ్ అని మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది' అని అన్నారు.