Begin typing your search above and press return to search.

వడ్డీతో సహా ఇచ్చేస్తా... హీరో కాన్ఫిడెన్స్

ఈ డైలాగ్ కాస్త ఓవర్‌ గా అనిపించినా కూడా చెప్తున్నాను.. ఇన్నాళ్లు సమయం వృదా చేశాను. ఆ సమయం ను మీకు వడ్డీతో సహా ఇస్తాను అన్నాడు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 7:29 AM GMT
వడ్డీతో సహా ఇచ్చేస్తా... హీరో కాన్ఫిడెన్స్
X

ఆర్‌ఎక్స్ 100 సినిమా తో హీరోగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న కార్తికేయ అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా సినిమాలే చేశాడు. అందులో ఒకటి రెండు కాస్త పర్వాలేదు అనిపించినా కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అందుకే ఈసారి కచ్చితంగా హిట్ కొడతాను అనే నమ్మకంతో హీరో కార్తికేయ ఉన్నాడు.

బెదురులంక 2012 సినిమా తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తికేయ చాలా నమ్మకం గా కనిపిస్తున్నాడు. విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్‌ గా ఈ సినిమా రూపొందినట్లుగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కార్తికేయ మాట్లాడుతూ తన నమ్మకంను చెబుతూ వస్తున్నాడు.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కార్తికేయ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను చాలా సినిమాలు చేశాను. వాస్తవానికి వాటిల్లో చాలా సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో చాలా టైమ్ వేస్ట్‌ అయింది. నన్ను అభిమానించి నా సినిమాలు చూస్తూ ఎంకరేజ్ చేసిన అభిమానుల సమయం కూడా వృదా అయిందని కార్తికేయ అన్నాడు.

ఈ డైలాగ్ కాస్త ఓవర్‌ గా అనిపించినా కూడా చెప్తున్నాను.. ఇన్నాళ్లు సమయం వృదా చేశాను. ఆ సమయం ను మీకు వడ్డీతో సహా ఇస్తాను అన్నాడు. నలుగురికి నచ్చితే చెప్పండి అంటూ కార్తికేయ ఈ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేస్తున్నాడు. స్వార్థం లేకుండా ఈ సినిమాను చేశాము.

ఈ సినిమా హిట్ తో నటీ నటులు అందరికి మంచి పేరు రావడం ఖాయం అన్నాడు. ఇక ఈ సినిమా లో హీరోయిన్‌ గా డీజే టిల్లు ఫేమ్ నేహా శర్మ నటించిన విషయం తెల్సిందే. యుగాంతం కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్‌ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది.