కార్తి ఖైదీ 2.. టార్గెట్ ఫిక్స్..!
ఐతే ఖైదీ లో సూర్య రోలెక్స్ రోల్ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. విక్రం సినిమా లో చివర్లో సూర్య రోలెక్స్ రోల్ అదరగొట్టాడు.
By: Tupaki Desk | 26 July 2025 11:37 AM ISTకోలీవుడ్ స్టార్ కార్తి ప్రస్తుతం సర్దార్ 2 పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ ఉంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఖైదీ 2 ప్లాన్ చేస్తున్నాడు కార్తి. ఖైదీ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. ఈ సినిమా లో కార్తి రోల్.. అతని యాటిట్యూడ్.. అన్నీ కూడా లోకేష్ డైరెక్షన్ రేంజ్ ఏంటన్నది చూపించాయి. ఇక నెక్స్ట్ విక్రం, లియో త్వరలో కూలీ ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతున్నాయి.
ఐతే ఖైదీ లో సూర్య రోలెక్స్ రోల్ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. విక్రం సినిమా లో చివర్లో సూర్య రోలెక్స్ రోల్ అదరగొట్టాడు. సినిమా మొత్తం ఒక లెక్క చివర రోలెక్స్ రోల్ వచ్చి చేసిన హంగామా ఒక లెక్క అనిపించింది. కార్తి ఖైదీ 2 లో ఢిల్లీతో పాటు రోలెక్స్ పాత్ర కూడా ఉంటే మాత్రం సినిమా రేంజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కార్తి ఖైదీ 2 కోసం రఫ్ లుక్ తో కనిపిస్తాడట.
ఆగష్టులో కూలీ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం. లోకేష్ ఖైదీ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఖైదీ 2 ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అంతా సెటప్ చేస్తున్నారట. సినిమాలో కార్తి క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. ఖైదీ 2 కథ కూడా బాగా వచ్చిందని తెలుస్తుంది. ఐతే అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఖైదీ 2ని నెక్స్ట్ ఇయర్ అంటే 2026 సెకండ్ హాఫ్ మళ్లీ దసరా, దీపావళికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట.
తప్పకుండా ఖైదీ 2కి సౌత్ అంతటా సూపర్ బజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఖైదీ 2 లో ఇంకా సర్ ప్రైజింగ్ రోల్స్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రేజ్ ని మరింత పెంచే ప్రయత్నం చేస్తాయని అంటున్నారు. కార్తి మాత్రం ఎప్పుడెప్పుడు ఖైదీ 2 సెట్స్ లో జాయిన్ అవ్వాలా అన్న ఆసక్తితో ఉన్నాడు. కార్తి ఖైదీ 2 తప్పకుండా అంచనాలకు తగినట్టుగానే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
కార్తి సర్దార్ 2, వా వాతియా, మార్షల్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో హిట్ 4 కి కూడా సైన్ చేశాడని తెలుస్తుంది. ఐతే వీటిలో ఖైదీ 2 మీద మాత్రం భారీ హైప్ ఉందని తెలిసిందే.
