Begin typing your search above and press return to search.

'క‌ర్ణ' లాంచింగ్ ఫిక్సైందా?

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు లీక్ అయ్యాయి

By:  Tupaki Desk   |   4 Aug 2023 7:47 AM GMT
క‌ర్ణ లాంచింగ్ ఫిక్సైందా?
X

కోలీవుడ్ స్టార్ సూర్య ఎలాంటి న‌టుడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు. వైవిథ్య‌మైన చిత్రాలు..పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు. అందుకే మేక‌ర్స్ అంతా సూర్య‌తో సాహ‌సాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. సూర్య‌లో క‌ష్ట‌ప‌డే త‌త్వం మేక‌ర్స్ ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. త‌మిళ న‌టుడైనా తెలుగు న‌టుడిలా ఇక్క‌డి అభిమానులు ఆద‌రిస్తారు. ఆయ‌న సినిమాలు బాలీవుడ్ లో సైతం రీమేక్ అయ్యాయి.

తాజాగా 'కర్ణ' టైటిల్ తో సూర్య పాన్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై సూర్య చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు లీక్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ మేక‌ర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఇటీవ‌లే స్క్రిప్ట్‌ను సూర్యకి వినిపించారుట‌. సూర్య గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర నుండి ప్రేరణ పొంది క‌థ‌ని సిద్దం చేసినట్లు స‌మాచారం.

ఇక ఈ సినిమా బ‌డ్జెట్ 600 కోట్ల అట‌.ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొస్తుంది. అయితే నిర్మాణంలో ఓం భాగ‌స్వామ్యం అవుతారా? లేదా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

హిందీ లో ఎన్నో సినిమాల్ని రాకేష్ ఓం ప్రకాష్ స్వీయా దర్శ‌క‌త్వంలో నిర్మించారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణ విష‌యంలోనూ ఆయ‌న భాగ‌స్వామ్యం ఉంటుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

హిందీ..త‌మిళ్ భాష‌ల్లో తెర‌కెక్కించి అన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో వివిధ భారతీయ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీల‌క పాత్రలు పోషించనున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర వేగంగా జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ లో ప్రారంభి చాల‌ని సన్నాహాలు చేస్తున్నారుట‌. ప్రస్తుతం సూర్య 'కంగువ'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన అనంత‌రం క‌ర్ణ‌పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.