Begin typing your search above and press return to search.

ఆ స్టార్ అలియాభ‌ట్ కోసం ట్రై చేస్తున్నాడా?

ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగంలో నాయిక‌గా అలియాభట్ ని తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు అప్పుడే మొద‌లు పెట్టిన‌ట్లు తెలిసింది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 7:26 AM GMT
ఆ స్టార్ అలియాభ‌ట్ కోసం ట్రై చేస్తున్నాడా?
X

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ కి టాలీవుడ్ ఏ స్థాయిలో పెద్ద పీట వేస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. 'ఆర్ ఆర్ ఆర్' లో సీత‌మ్మ పాత్ర‌లో మెప్పించిన‌ప్ప‌టి నుంచి ఏ అగ్ర హీరో సినిమా చేసినా..ఆయ‌న స‌ర‌స‌న అలియాభ‌ట్ పేరు వినిపిస్తుంది. ఆమె న‌టిస్తుందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ముందు అలియాభ‌ట్ పేరుని తెర‌పైకి తెచ్చేస్తున్నారు. ద‌ర్శ‌కులు కూడా అలియా అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. అది ఎంత‌గా ప్ర‌భావం చూపిందంటే? చివ‌రికి అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీకపూర్ కంటే కూడా అలియాభట్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నంత‌గా.

అలియాభ‌ట్ ఒకే చెబితే 'దేవ‌ర‌'లో అమె న‌టించాలి. ఆమె కాద‌న్న త‌ర్వాత‌నే జాన్వీకపూర్ కి ఆ ఛాన్స్ వ‌చ్చింది. ఇంకా స్టార్ హీరోల చిత్రాల్లో అలియాభ‌ట్ కి చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆమె బిజీ షెడ్యూల్ కార‌ణంగా అన్నింటికి నో చెప్పింది. తాజాగా ఈ రేసులో కి కోలీవుడ్ కూడా చేరుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సూర్య హీరోగా 'కంగువ' అనే పిరియాడిక్ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలు గా తెర‌కెక్కుతోన్న చిత్రంలో మొద‌టి భాగంలో దిశా పటానీ హీరోగా న‌టిస్తోంది.

ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగంలో నాయిక‌గా అలియాభట్ ని తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు అప్పుడే మొద‌లు పెట్టిన‌ట్లు తెలిసింది. కంగువ మొద‌టి భాగం సెట్స్ లో ఉన్నా ప్ర‌య‌త్నాలు మాత్రం సీరియ‌స్ గా సాగుతున్నాయ‌ట‌. బాలీవుడ్ లో అలియాభ‌ట్ ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డి సినిమాల‌కే డేట్లు కేటాయించ‌లేక‌పోతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నిస్తే గానీ అప్ప‌టికీ లైన్ లోకి రాద‌ని భావించిన ద‌ర్శ‌కుడు శివ ఆమె కోసం ఓ యాడ్ ఏజెన్సీ ద్వారా సంప్ర‌దింపులు జరుపుతున్న‌ట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన డీల్ మొత్తం యాడ్ ఏజెన్సీకి అప్ప‌గించారుట‌. పారితోషికం..క‌మీష‌న్ విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డేది లేద‌ని అలియా డేట్లు ఎలాగైనా లాక్ చేసే బాధ్య‌త‌లు ఏజెన్సీపై పెట్టిన‌ట్లు తెలుస్తోంది. చూసారా? అలియాభ‌ట్ రేంజ్ మార్కెట్ లో ఎలా ఉందో. 'గుంగుబాయ్ క‌తియావాడి' లాంటి సినిమా అలియాకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.