Begin typing your search above and press return to search.

దివాలీ ట్రీట్..కొలిమిలో ఆదివాసి నిప్పు!

తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని మ‌రో ఇన్నోవేటివ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో సూర్య లుక్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 1:35 PM GMT
దివాలీ ట్రీట్..కొలిమిలో ఆదివాసి నిప్పు!
X

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పిరియాడిక్ చిత్రం 'కంగువ' భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామ‌గా తెర‌కెక్కుతోన్న సినిమాలో సూర్య లుక్ ఇప్ప‌టికే సంచ‌ల‌నం. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంకంత‌కు అంచ‌నాలు రెట్టింపు పెంచేస్తు న్నాయి. సాహ‌సోపేతమైన ఇన్నోవేటివ్ స్టోరీలు ప‌డితే సూర్య చెల‌రేగిపోతాడ‌ని మ‌రోసారి ప్రూవ్ అవుతుంది.


'కంగువా' కోసం అలాగే ప‌నిచేస్తున్నాడు. తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని మ‌రో ఇన్నోవేటివ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో సూర్య లుక్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. సూర్య‌లో ఆది మాన‌వు డ‌ని ఓ రేంజ్లో హైలైట్ చేసిన‌ట్లు ఉంది. సూర్య ఆహార్యం ప్ర‌తీది ఎంతో వైవిథ్యంగా ఉంది. చేతిలో కాగుతోన్న కాగ‌డ‌.. మెడ‌లో పులిగోరెలు..శ‌రీరంపై బ‌ల‌మైన క‌వ‌చం... ప‌చ్చ‌బొట్టులు అన్ని సూర్య స‌రికొత్త‌గా ప్రోజెక్ట్ చేస్తున్నా యి.

బ్యాక్ గ్రౌండ్ లో పాత కాల‌పు బూర‌లు..శంకువులు ఊద‌డం.. వాళ్ల ఆహార్యాలు..కాళ్ల కింద స‌ల స‌లా కాగుతోన్న కొలిమి అన్నీ అద్భుతంగా ఉన్నాయి. యుద్దానికి ముందు సిద్ద‌మ‌య్యే విధానాన్ని పోస్ట‌ర్ లో ఎంతో చక్క‌గా డిజైన్ చేసారు. దివాలీ టైమింగ్ పోస్ట‌ర్ ఇది. ఓవైపు బ‌య‌ట ట‌పాసుల మోత మోగుతోన్న వేళ‌..కంగువాతో అంత‌కు మించిన దివాలీ ట్రీట్ ఇది.

ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పోస్ట‌ర్ తో అభిమానుల్లో అంచ‌నాలు ఆకాశా న్నంటుతున్నాయి. కంగువా ఎప్పుడు చూద్దామా? అన్న ఎగ్జైట్ మెంట్ ప్ర‌చార చిత్రాలే క‌ల్పిస్తున్నా యాంటూ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇందులో సూర్య‌కి జోడీగా దిశా ప‌టానీ న‌టిస్తోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్- కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్..యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.