Begin typing your search above and press return to search.

సూర్య కంగువ ఆ టార్గెట్ రీచ్ అవుతుందా..?

కోలీవుడ్ స్టార్ సూర్య కొంతకాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చాడు

By:  Tupaki Desk   |   16 April 2024 5:58 AM GMT
సూర్య కంగువ ఆ టార్గెట్ రీచ్ అవుతుందా..?
X

కోలీవుడ్ స్టార్ సూర్య కొంతకాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చాడు. తన విలక్షణ నటనతో ఎలాంటి కథతో అయినా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న సూర్య ఫ్యాన్స్ మాత్రం అతన్ని ఒక భారీ సినిమాతో చూడాలని అనుకున్నారు. అయితే వార్ అభ్యర్ధన మేరకు కంగువ అనే భారీ సినిమా చేస్తున్నాడు సూర్య. తమిళ దర్శకుడు శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువ సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది.

స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ రెండు బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రచార చిత్రాలు సూర్య క్యారెక్టరైజేషన్ అంతా కావల్సినంత బజ్ వచ్చేలా చేశాయి. సూర్య కథల సెలక్షన్స్ గురించి తెలుసు కాబట్టి కంగువ బిజినెస్ విషయంలో కూడా బాగానే జరుగుతుందట.

బిజినెస్ లెక్కలు అల ఉంచితే సూర్య కంగువతో తన కెరీర్ బెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. సూర్య కంగువతో 500 కోట్ల దాకా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడట. కోలీవుద్ హీరో దళపతి విజయ్ ప్రతి సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. సరైన కంటెంట్ తో వస్తే పాన్ ఇండియా లెవెల్ లో 500 కోట్లు అన్నది అంత కష్టమేమి కాదు. కానీ కంగువ సినిమాతో సూర్య దాన్ని రీచ్ అవుతాడా అన్నది చూడాలి.

సూర్య మాత్రం కంగువ కోసం తన బ్లడ్ పెట్టేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో సూర్య నట విశ్వరూపం చూపించబోతున్నాడని అంటున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా చూస్తున్నారట. సూర్య కంగువ రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీగా చెప్పలేదు కానీ ఎప్పుడు వచ్చినా సూర్య మాత్రం సెన్సేషన్ సృష్టిస్తాడని చిత్ర యూనిట్ చెబుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు చేస్తున్న హంగామాకు చెక్ పెట్టేలా సూర్య కంగువ ఉండబోతుందని టాక్.

తెలుగు, తమిళలో కంగువ మీద భారీ హైప్ ఉంది సూర్యకు ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రకారం సినిమా బాగుంటే రికార్డు వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే సూర్య హిందీ ఆడియన్స్ ను కూడా మెప్పించ కలిగితే మాత్రం అక్కడ కూడా వసూళ్ల మోత మోగించే ఛాన్స్ ఉంటుంది. అందుకే కంగువ బీ టౌన్ ఆడియన్స్ ను అలరించేలా కూడా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.