Begin typing your search above and press return to search.

కంగువ సెకండ్ లుక్: 24 ఆత్రేయ మ‌ళ్లీ వ‌స్తున్నాడు!

రెండవ పోస్టర్‌లో సూర్య‌ రెండు విభిన్న రూపాలు ఎంతో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ పోస్ట‌ర్ లో కొత్త‌గా అభిమానులు ఆశించేవి ఏవీ బహిర్గతం చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:33 AM GMT
కంగువ సెకండ్ లుక్: 24 ఆత్రేయ మ‌ళ్లీ వ‌స్తున్నాడు!
X

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న కంగువ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పాన్ వ‌ర‌ల్డ్ కేటగిరీలో అత్యంత భారీగా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా కంగువ‌ రెండవ పోస్టర్‌ను విడుదల చేశారు. తమిళ పీరియడ్ వార్ డ్రామా చిత్రం సూర్యని రెండు విభిన్న అవతారాల్లో ఆవిష్క‌రించ‌నుంద‌ని ఈ పోస్ట‌ర్ వెల్ల‌డిస్తోంది. మొదటి పోస్టర్‌లో ప్రేక్షకులకు ప‌రిచ‌యం అయిపోయిన యోధుడిని చూపిస్తూనే... మోడ్ర‌న్ గెట‌ప్ లోను సూర్య క‌నిపించాడు. రెండవ పాత్ర‌లో తెల్లటి చొక్కా, పూసల హారాలు, గొలుసులు ధరించి ఉన్న ఆధునిక యువ‌కుడిని ఎలివేట్ చేసారు.


రెండవ పోస్టర్‌లో సూర్య‌ రెండు విభిన్న రూపాలు ఎంతో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ పోస్ట‌ర్ లో కొత్త‌గా అభిమానులు ఆశించేవి ఏవీ బహిర్గతం చేయ‌లేదు. నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ట్విట్టర్ లో దీనికి ఆస‌క్తిక‌ర ట్యాగ్ ని జోడించింది. ''ఎ డెస్టినీ స్ట్రాంగర్ దేన్ టైమ్. గతం, వర్తమానం,యు భవిష్యత్తు. అన్నిచోట్లా ఒక పేరు ప్రతిధ్వనిస్తుంది... అదే #కంగువ. ఇదిగో #కంగువ సెకండ్ లుక్'' అని ట్యాగ్ లైన్ రాసారు.

నవంబర్ 2023లో మొద‌టి పోస్ట‌ర్ విడుద‌లైన‌ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చూసి నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని 'రాజు ఇక్కడ ఉన్నాడు' అని రాశాడు. మరో అభిమాని ఇలా రాసాడు. ''మాస్.. బెస్ట్ పోస్టర్.. నిన్న వెట్టయ్యన్, ఈరోజు #కంగువ'' అన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్న అభిమానులలో ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ''వావ్, ఈ బృందం నుండి ఏదో అద్భుతం వస్తోంది. అంచనాలు భారీగా ఉన్నాయి'' అన్నారు.

కొంద‌రు అభిమానులు సూర్య మోడ్ర‌న్ రూపాన్ని చూడ‌గానే 2016 చిత్రం 24తో పోల్చారు. అక్క‌డా గ‌తం, వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ కాలాల్లోకి సూర్య ప్ర‌యాణిస్తాడు. అక్క‌డ‌ ఆత్రేయ పాత్రను పోషించాడు. ఒక అభిమాని '24 సినిమా లుక్స్' అని రాస్తే, మరొకరు '24 సినిమా (అద్భుతమైన ఎమోటికాన్)'' అని రాశారు. ఒక అభిమాని 'ఆత్రేయ తిరిగి వస్తాడు' అని రాశాడు.

గత వారం నాటికే సూర్య కంగువ షూటింగ్‌ను ముగించాడు. అతడు యోధుడి వేషంలో ఉన్న ఒక స్టిల్‌ను పోస్ట్ చేసి సూర్య ఇలా రాసాడు. ''కంగువ కోసం నా చివరి షాట్ పూర్తయింది! మొత్తం యూనిట్ సానుకూలతతో నిండిపోయింది! ఈ ముగింపు అనేకాల‌కు ప్రారంభం'' అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించాడు. ఇలాంటి పాన్ ఇండియా చిత్రాలు మ‌రెన్నో వ‌స్తాయి అనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసాడు.కంగువలో దిశా పటాని కూడా కథానాయికగా నటిస్తోంది. కంగువ 2022 చిత్రం ఎదర్కుమ్ తునింధవన్ తర్వాత సోలో లీడ్‌గా పెద్ద తెరపైకి సూర్య తిరిగి వస్తున్నాడు. కమల్ హాసన్ విక్రమ్.. R మాధవన్ రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్‌లో అతిధి పాత్రలు చేస్తూ కనిపించిన సూర్య‌కు కంగువ పూర్తి ప్ర‌ధాన చిత్రం కానుంది.