సిలికాన్ వ్యాలీలో కమల్ హాసన్ సందడి: ఇండియన్ ఇన్నోవేషన్ పై ప్రశంసల వర్షం
ఈ సందర్భంగా ఆయన భారతీయ ప్రతిభను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
By: Tupaki Desk | 11 April 2025 7:17 AMతెలుగు, తమిళ చిత్రరంగాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తన విలక్షణ నటనతో గుర్తింపు పొందిన కమల్ హాసన్ మరోసారి తన విజ్ఞానపూరిత అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా రంగానికి కాకుండా టెక్నాలజీ రంగానికి సంబంధించిన విషయంపై కామెంట్ చేశారు. ఇటీవలే అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ AI సంస్థ "పర్ప్లెక్సిటీ ఏఐ" (Perplexity AI) ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ ప్రతిభను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కమల్ హాసన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. “సినిమా నుంచి సిలికాన్ వరకు సాధనాలు మారిపోతున్నా.. భవిష్యత్‌పై మేం చూపించే ఆసక్తి మాత్రం అలాగే ఉంది. పర్ప్లెక్సిటీ AIని సందర్శించిన తర్వాత నాకు ఆ ఊపిరే రీ ఫ్రెస్ అయ్యింది,” అని పేర్కొన్నారు. కమల్ తన సందేశంలో భారతీయ యువ ఇన్నోవేటర్లను కొనియాడారు. ఆ సంస్థను స్థాపించిన అరవ్ శ్రీనివాస్ నేతృత్వంలోని జట్టు ప్రపంచాన్ని ప్రభావితం చేసే మార్గంలో అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
పర్ప్లెక్సిటీ AI అనే సంస్థ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో దూసుకెళ్తోంది. గూగుల్ తరహాలో అడిగిన ప్రతీ ప్రశ్నకు ప్రామాణిక సమాధానాలను ఇచ్చే ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అరవ్ శ్రీనివాస్ నేతృత్వంలో నడుస్తున్న ఈ సంస్థ ప్రధానంగా 'ఒక ప్రశ్న ఒక మార్పు' అనే విధానాన్ని అవలంబిస్తూ అభివృద్ధి చెందుతోంది.
కమల్ హాసన్ మాట్లాడుతూ, ఈరోజు మనం చూస్తున్న టెక్నాలజీ విజయం అంటే నేటి యువత తమ ఆలోచనలను ఎలా పరిణతిపర్చగలరో చూపిస్తున్న ఉదాహరణే.. అని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్‌కి వేలల్లో లైక్స్, షేర్స్ వస్తున్నాయి. భారతీయ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో కమల్ హాసన్ చేసిన ఈ ప్రయత్నానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఇతర రంగాలకు సంబంధించి గళమెత్తడంలో కమల్ హాసన్ ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. సినిమాలకే పరిమితం కాకుండా సాంకేతికత, రాజకీయాలు, సమాజం వంటి అనేక అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా భారతీయ టెక్ యూత్‌ను గుర్తించి, వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన ముందుండడం గర్వించదగిన విషయం. ఇక ప్రస్తుతం కమల్ మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.