Begin typing your search above and press return to search.

కోలీవుడ్ స్టార్స్ గురించి స్టార్ వైఫ్ కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు

By:  Tupaki Desk   |   12 April 2024 5:28 AM GMT
కోలీవుడ్ స్టార్స్ గురించి స్టార్ వైఫ్ కామెంట్స్..!
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తను ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం అండ్ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు సూర్య. అందుకే అతను స్టార్ హీరో మాత్రమే కాదు ఫ్యామిలీ స్టార్ కూడా అని అంటుంటారు. జ్యోతిక విషయానికి వస్తే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈమధ్య ఆమె మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. డిఫరెంట్ కథలతో సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అంటున్నారు.

జ్యోతిక రీసెంట్ గా నటించిన సైతాన్ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల పైగా వసూళ్లను రాబట్టడం తో జ్యోతిక యాక్టింగ్ కొనసాగించాలనే ఆలోచనని మరింత బలంగా మార్చింది. ఇక రాబోయే సినిమాల్లో కూడా తనే లీడ్ రోల్ లో నటిస్తానని అంటున్నారు జ్యోతిక. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్స్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

లాస్ట్ ఇయర్ మళయాళంలో ఆమె కాథల్ అనే సినిమాలో నటించింది. మమ్ముట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జ్యోతిక ఆయనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మమ్ముట్టి సినిమా కోసం చాలా కష్టపడతారని.. ఆయన డెడికేషన్ బాగుంటుందని అన్నారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ డం గురించి కూడా చెప్పుకొచ్చిన జ్యోతిక విజయ్ కి కన్సిస్టెన్సీ ఎక్కువ అని అన్నారు. ఇక వీరితో పాటుగా తన భర్త స్టార్ హీరో సూర్య గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జ్యోతిక.

సూర్య అందరినీ ఎంతో మర్యాదగా చూసుకుంటాడు.. అందరినీ గౌరవిస్తాడు. ప్రతి ఒక్కరి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాడు. ఇదే తనపై అభిమానాన్ని పెంచేలా చేస్తుందని అన్నారు. అంతేకాదు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాడని ఆయనతో స్నేహం చేయడం అందరికీ ఇష్టమని అన్నారు. సూర్య జ్యోతిక గురించి ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. సూర్య నుంచి జ్యోతిక దూరమవుతుందని ఆమె తన మకాం ముంబైకి మార్చేసిందని వార్తలు రాసుకొచ్చారు. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి దూరం రాలేదని జ్యోతిక మాటలను బట్టి అర్ధమవుతుంది. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో రాబోతున్నారు. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేశారు.