Begin typing your search above and press return to search.

మేడం ఆ ఫోటో ఎందుకు డిలీట్‌ చేశారు...?

సోషల్ మీడియాలో స్టార్స్ ఏ ఫోటో షేర్‌ చేసినా, ఏ విషయాన్ని గురించి స్పందించినా కూడా అది చాలా వైరల్‌ అవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   31 May 2025 4:15 PM IST
మేడం ఆ ఫోటో ఎందుకు డిలీట్‌ చేశారు...?
X

సోషల్ మీడియాలో స్టార్స్ ఏ ఫోటో షేర్‌ చేసినా, ఏ విషయాన్ని గురించి స్పందించినా కూడా అది చాలా వైరల్‌ అవుతూ ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో స్పందించే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ సెలబ్రెటీలు స్పందించడం మనం చూస్తూ ఉంటాం, ఇక ఫోటోలను షేర్ చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ద కనబర్చినా నిమిషాల్లో వైరల్‌ అయ్యే ఫోటోలతో సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసే సమయంలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వారు జాగ్రత్త పడుతూ ఉంటారు. తాజాగా సీనియర్ నటి జ్యోతిక షేర్‌ చేసిన ఒక ఫోటో వైరల్‌ కావడం, ఆ వెంటనే డిలీట్‌ చేయడం జరిగింది.

జ్యోతిక ఇటీవల తన కూతురు దియా హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ ఫోటోలను షేర్‌ చేసింది. కూతురుతో పాటు భర్త సూర్య ఉన్న ఫోటోలను జ్యోతిక షేర్ చేసింది. ఆ ఫోటోల్లో సూర్య లుక్‌ గురించి చర్చ జరిగింది. ఇటీవల వచ్చిన కంగువా, రెట్రో సినిమాలతో పోల్చితే తాజా లుక్‌ చాలా బాగుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు, అంతే కాకుండా సినిమాలో ఆయన ఇలా కనిపిస్తే బాగుంటుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా మంది అప్పటికే ఆ ఫోటోలను షేర్‌ చేశారు, కొందరు సేవ్‌ చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఫోటోలు జ్యోతిక సోషల్‌ మీడియా అకౌంట్‌లో కనిపించకుండా పోయాయి. జ్యోతిక వాటిని డిలీట్‌ చేసింది.

సూర్య నిండుగా గడ్డంతో పాటు స్మార్ట్‌ లుక్‌లో కనిపించడంతో అభిమానులు తదుపరి సినిమాలో ఇలా కనిపిస్తాడేమో అని అంతా అనుకుంటూ ఉండగా జ్యోతిక ఆ ఫోటోలు డిలీట్‌ చేయడం చర్చనీయాంశం అయింది. జ్యోతిక ఆ ఫోటోలు డిలీట్‌ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందులో వారి కూతురు దియా ఉండటం వల్ల డిలీట్‌ చేసి ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు మాత్రం సూర్య న్యూ లుక్ రివీల్‌ కాకూడదు అనే ఉద్దేశంతో డిలీట్‌ చేసి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఆ ఫోటోలు అప్పటికే సోషల్‌ మీడియాలో చాలా మంది షేర్ చేశారు.

ప్రస్తుతం సూర్య కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. రెట్రో సినిమా విషయంలో పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్ వంటి దర్శకుడు కూడా సూర్యకు హిట్‌ ఇవ్వలేక పోవడంతో అభిమానులు మరో కొత్త సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సింగం ప్రాంచైజీ మూవీని ప్రారంభించాలని అభిమానులు సూర్యను డిమాండ్‌ చేస్తున్నారు. సూర్య సైతం సింగం ప్రాంచైజీ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. త్వరలోనే సూర్య కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.