Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ నవరస కథానాయకుడు..!

యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ అంటూ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించడమే తన లక్ష్యం అనేలా సినిమాలు చేశాడు

By:  Tupaki Desk   |   20 May 2024 6:17 AM GMT
ఎన్టీఆర్‌ నవరస కథానాయకుడు..!
X

NTR ఈ మూడు అక్షరాల సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటి.. నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన చరిత్ర ఆయనది. నేటి యువతర కథానాయకులలో నవరసాలను పండించగల నటుడు ఎన్టీఆర్‌. కెరీర్ మొదట్లోనే ప్రేక్షకుల నుంచి మాస్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్‌ ఆ మేనియాతో స్టార్ రేంజ్ దక్కించుకున్నాడు. యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ అంటూ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించడమే తన లక్ష్యం అనేలా సినిమాలు చేశాడు.

కొన్నాళ్లు మరీ మూస థోరణిలో సినిమాలు చేస్తున్నాం అనిపించి ఎంటర్టైనర్ సినిమాలు చేశాడు. మరోపక్క జానపద సినిమాలకు తాను రెడీ అని చూపించాడు. ఎన్టీఆర్‌ ఒక స్టార్ హీరో అని చెప్పడం కన్నా ఒక పరిపూర్ణ నటుడు అని చెప్పడం సబబు. ఈతరం కథానాయకుల్లో ఎవరికీ లేని ఒక ప్రత్యేకత ఎన్టీఆర్‌ లో ఉంది.

అభినయం, ఆహార్యం, వాక్ చాతుర్యం, నాట్యం ఇలా ఒకటేంటి అన్నిట్లో ది బెస్ట్ అందిస్తాడు ఎన్టీఆర్‌ అందుకే ఆయన్ను అభిమానులు అంతగా ప్రేమిస్తారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్‌ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్‌ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం.

యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ అనగానే నందమూరి తారక రామారావు అని తెలుసు. కానీ హరికృష్ణ మొదట ఎన్టీఆర్‌ కు తారక్ రామ్ అని పేరు పెట్టారట. ఒకసారి తారక్ ని సీనియర్ ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకు వెళ్లగా ఆయనే తారక్ అన్న పేరుని తారక రామారావుగా మార్చారట. ఎన్టీఆర్‌ కి స్నేహితులంటే చాలా ఇష్టం. తన స్కూల్ ఫ్రెండ్స్ తో పాటుగా ఇండస్ట్రీ స్నేహితులతో కూడా ఎన్టీఆర్‌ తనకు సంబందించిన విషయాలన్ని పంచుకుంటారు. స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు తో కూడా ఎన్టీఆర్‌ చాలా క్లోజ్ గా ఉంటారు.

ఎన్టీఆర్‌ తొలిసారి మేకప్ వేసుకున్న సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆ సినిమాలో భరతుడిగా నటించారు. ఆ తర్వాత బాల రామాయణం సినిమాలో ఎన్టీఆర్‌ నటించారు. ఎన్టీఆర్ కూచిపూడిలో శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా చాలాచోట్ల ప్రదర్శనలు ఇచ్చారు.

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి ఇలా వరుస సూహిట్లు అందుకున్నారు. ఎన్టీఆర్‌ కి 9 అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన కారు కి 9999 నెంబర్ తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్‌ ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా.. ఫేవరేట్ మూవీ దాన వీర శూర కర్ణ.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. RRR తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.