Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్: 'టైగ‌ర్ 3'లో జూనియ‌ర్ ఎన్టీఆర్?

సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర‌ను కూడా పరిచయం చేయ‌డం వెన‌క ఒక అద్భుత‌మైన ఎత్తుగ‌డ ఉంది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 3:00 PM GMT
ఇంట్రెస్టింగ్: టైగ‌ర్ 3లో జూనియ‌ర్ ఎన్టీఆర్?
X

టైగ‌ర్ 3కి సంబంధించిన ఒక కీల‌క అప్ డేట్ బాలీవుడ్ మీడియాలో వేడి పెంచుతోంది. సల్మాన్ ఖాన్ న‌టించిన‌ స్పై థ్రిల్లర్‌తో RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడని, అది హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న 'వార్ 2'ని చూడటానికి దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను ఉత్సాహపరుస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి..

కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ న‌టించిన 'టైగర్ 3' 2023 దీపావ‌ళి సీజ‌న్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా విడుద‌ల కానుంది. టీజర్ ఇటీవ‌లే విడుద‌లై అభిమానుల్లోకి దూసుకెళ్లింది. అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో సల్మాన్ ఖాన్ కంబ్యాక్ ఉత్కంఠ‌ను పెంచింది. మోస్ట్ అవైటెడ్ 'టైగ‌ర్ 3' విడుద‌ల కోసం సల్మాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆసక్తికరంగా 10 నవంబర్ 2023న దీపావళి విడుదలకు ఇంకో నెల‌రోజులు ఉండ‌గానే, ఫ్యాన్స్ లో టెన్ష‌న్ మ‌రింత‌ పెరుగుతోంది.

అంతేకాదు.. టైగ‌ర్ 3లో ఒక బిగ్ స‌ర్ ప్రైజ్ మ‌రింత వేడి పెంచుతుంద‌ని అంచ‌నా. వార్ 2లో విలన్‌గా నటిస్తున్న‌ జూనియర్ ఎన్టీఆర్‌ని ఈ సినిమాలో క్లుప్తంగా పరిచయం చేయడానికి ఆదిత్య చోప్రా ప్లాన్ చేసినట్లు ప్ర‌ముఖ‌ బాలీవుడ్ మీడియా క‌థ‌నం వెలువ‌రించ‌డం వేడెక్కిస్తోంది. అంటే ఎన్టీఆర్ డెబ్యూ ఇప్పుడు టైగ‌ర్ 3లో ఒక మెరుపులా ఉండ‌నుంద‌ని భావించాలి. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లోను ప్ర‌కంప‌నంగా మార‌నుంది.

'వార్ 2' ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణంలో హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గూఢచారి విశ్వంలో వార్ 2 మ‌రో లెవ‌ల్ లో ఉండాల‌ని ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో ఎన్టీఆర్ విల‌న్ పాత్ర ఎంతో ఎగ్జ‌యిట్ చేయ‌నుంద‌ని స‌మాచారం. అలాగే ఈ విశ్వంలో ఆలియా భట్ ప్ర‌ధాన లీడ్ లో భారీ స్పై యాక్ష‌న్ చిత్రంతో అనుసంధానించడానికి ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి సినిమా స్పిన్ ఆఫ్ లో ఇత‌ర సినిమాల పాత్ర‌ల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా త‌దుప‌రి చిత్రం కోసం ఆస‌క్తిని పెంచ‌డ‌మే ఈ విశ్వం ప్ర‌త్యేక‌త‌.

సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర‌ను కూడా పరిచయం చేయ‌డం వెన‌క ఒక అద్భుత‌మైన ఎత్తుగ‌డ ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అత‌డి ప‌రిచ‌యంతో వార్ 2పై ద‌క్షిణాదిలో గొప్ప ఆస‌క్తి పెరుగుతుందనేది య‌ష్ రాజ్ ఫిలింస్ ఎత్తుగ‌డ‌. పైగా ఈ సీజ‌న్ లో ఎంతో క్రేజీగా విడుద‌ల‌వుతున్న టైగ‌ర్ 3తో చాలా ముందుగా ఎన్టీఆర్ ని ప‌రిచ‌యం చేస్తే అది వార్ 2 పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతుంద‌ని భావిస్తున్నార‌ట‌.

వార్ 2, పఠాన్, టైగర్ నుండి కబీర్ విలన్‌ను కనుగొనే పనిలో ఉంటాడు. ఇది ఆదిత్య చోప్రా సృష్టించిన కలల విశ్వం. ప్రేక్షకులు క‌చ్చితంగా ఇలాంటి మాయాజాలానికి ముగ్ధులైపోతారు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో విలన్‌గా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌డం ఇప్ప‌టికే అభిమానుల్లో ఉత్కంఠ‌ను పెంచింది. ఇది యూనివ‌ర్శ్ సినిమాల‌ స‌మీకర‌ణాన్ని అమాంతం మార్చేయ‌నుంది. RRR స్టార్ ఎన్టీఆర్ మళ్లీ తనదైన‌ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.