ఎన్టీఆర్ ధరించిన షర్ట్ ధర ఎంతో తెలుసా..!
ఎన్టీఆర్ అంతకు ముందు ఎప్పుడూ వేసుకోని ఆ ఔట్ ఫిట్ యూనిక్‌గా ఉండటంతో అభిమానులు ఆ షర్ట్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు.
By: Tupaki Desk | 16 April 2025 3:31 PM ISTస్టార్స్ చూడ్డానికి సింపుల్‌గా కనిపించినా వారు ధరించే ఔట్ ఫిట్, యాక్ససిరీస్ చాలా ఖరీదైనవిగా ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్, హీరోలు, ప్రముఖులు ధరించిన డ్రెస్‌లు, చెప్పులు, వారు వాడే బ్యాక్స్ ఇలా ప్రతి ఒక్క దాని రేటు గురించి విన్నప్పుడు షాకింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయల ఖరీదు చేసే పాయింట్ ధరించాడనే వార్తలు రావడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. కానీ ఇప్పుడు అవి చాలా కామన్ అయ్యాయి. స్టార్స్ సినిమాల కోసం మాత్రమే కాకుండా రెగ్యులర్ లైఫ్‌లోనూ చాలా ఖరీదైన డ్రెస్‌లను వేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇదే విషయమై ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు.
ఇటీవల ఎన్టీఆర్ దుబాయ్‌లో అభిమానులతో కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన డార్క్ నీలిరంగు పూల చొక్కాను ధరించాడు. నల్ల ప్యాంట్‌పై ఆ షర్ట్ ఆకర్షణీయంగా కనిపించింది. ఎన్టీఆర్ అంతకు ముందు ఎప్పుడూ వేసుకోని ఆ ఔట్ ఫిట్ యూనిక్‌గా ఉండటంతో అభిమానులు ఆ షర్ట్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. అప్పుడు ఈ షర్ట్ ధర ఎంత అనే విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఆన్ లైన్‌లో ఈ షర్ట్‌కి ఏకంగా రూ.85,000 ధర కనిపిస్తుంది. ఈ స్పెషల్ ప్రింటెడ్ షర్ట్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ పర్యటన కోసం రెడీ చేయించుకున్నట్లుగానూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అంతే కాకుండా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కింది. కొమురం భీమ్ పాత్రలో నటించినందుకు గాను ఎన్టీఆర్‌కి విదేశాల్లోనూ గుర్తింపు దక్కింది. అందుకే ఎన్టీఆర్ తన డ్రెస్సింగ్‌తో పాటు సినిమాల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు దాదాపుగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఎన్టీఆర్‌కి ఒక్క షర్ట్ లక్ష ఖర్చు చేసి అయినా ధరించే అర్హత ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయమై స్పందిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ ఖరీదైన షర్ట్ కారణంగా వార్తల్లో నిలిచారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవర సినిమాతో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఎన్టీఆర్ ఈ ఏడాదిలో బాలీవుడ్ మూవీ వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వార్ 2 లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా, కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇక కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా షెడ్యూల్ పూర్తి అయింది. అతి త్వరలోనే ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నట్లు ప్రశాంత్ నీల్ టీం అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ వచ్చే ఏడాదిలో దేవర 2 సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
