తారక్ నెక్స్ట్.. అతనే కావాలట!
అయితే వార్-2 షూటింగ్ పార్ట్ ను ఇప్పటికే కంప్లీట్ చేసిన ఎన్టీఆర్.. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
By: Tupaki Desk | 30 Jun 2025 3:19 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చివరిగా దేవర మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు వార్ -2 మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఆ సినిమాతో బీ టౌన్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు తారక్.
అయితే వార్-2 షూటింగ్ పార్ట్ ను ఇప్పటికే కంప్లీట్ చేసిన ఎన్టీఆర్.. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అదే సమయంలో లైనప్ లో అదిరిపోయే సినిమాలను చేర్చారు. ఇప్పటికే దేవర పార్ట్-2 ఉండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా నిర్మాత నాగవంశీ తెలిపారు.
ఇటీవల మురుగన్ పుస్తకంతో కనిపించిన ఆయన.. త్రివిక్రమ్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ వర్క్ చేయనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. త్వరలో త్రివిక్రమ్ తో పాటు నెల్సన్ తో చేయాల్సిన సినిమాల అనౌన్స్మెంట్స్ రానున్నాయని టాక్.
అయితే ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ కు గాను మ్యూజిక్ డైరెక్టర్ గా టాలెంటెడ్ యువ దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో యమా బిజీగా ఉన్న ఆయననే.. తన రాబోయే చిత్రాలకు స్వరకర్తగా తీసుకోవడానికి ఎన్టీఆర్ ఆసక్తిగా ఉన్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అనిరుధ్.. ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 సినిమాకు పనిచేశారు. ఆ సమయంలో ఆయన వర్క్ కు తారక్ ఫుల్ ఇంప్రెస్ అయ్యారట. అవుట్ పుట్ పై సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అందుకే ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ సంగీత బాధ్యతలు అనిరుధ్ కు అప్పగించేశారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
దేవరకు వర్క్ చేసిన అనిరుధ్.. సీక్వెల్ కు కూడా ఆయనే పని చేయనున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత మైథలాజికల్ జోనర్ లో రానున్న తారక్- త్రివిక్రమ్ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయనున్న సినిమా సంగీత బాధ్యతలను అనిరుధ్ కు అప్పగించాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అనిరుధ్ తన వర్క్ తో ఎలా మెప్పిస్తారో చూడాలి.
