ఎన్టీఆర్.. ఆ రెండిట్లో ఏది ముందు?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 4:30 PMటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్-2 షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. బీటౌన్ ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్.
అదే సమయంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ సెట్స్ లో కొద్ది రోజుల క్రితం అడుగుపెట్టారు ఎన్టీఆర్. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది స్టార్టింగ్ కల్లా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తయ్యే అవకాశం ఉంది. 2026 జూన్ లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అయితే ప్రశాంత్ నీల్ మూవీ, వార్-2 కాకుండా ఇప్పటికే పలు సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీ ఇప్పటికే రిలీజ్ అయ్యి కమర్షియల్ హిట్ గా నిలవగా.. ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఆ తర్వాత సీక్వెల్ ఉండదని ప్రచారం జరగ్గా.. కచ్చితంగా ఉంటుందని తారక్ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ కు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితార నాగవంశీ ఆ సినిమాను నిర్మించనున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. తారక్ ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా తెలిపారు.
దీంతో ఆయన.. ముందు కొరటాలతో వర్క్ చేయనున్నారా లేదా నెల్సన్ తో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఏ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందో స్పష్టత లేదు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట.
అటు తారక్ 2026 స్టార్టింగ్ లో ఫ్రీ అవుతారు. అయితే కొరటాల శివ ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని తెలుస్తోంది. త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారని టాక్. ప్రశాంత్ నీల్- తారక్ మూవీ కంప్లీట్ అయ్యేసరికి కొరటాల రెడీ అయిపోతారు. దీంతో ఎన్టీఆర్ దేవర 2, నెల్సన్ ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేస్తారా లేదా ఏ సినిమా సెట్స్ లోకి ముందు వెళ్లనున్నారో వేచి చూడాలి.