వార్-2 టీజర్... అసలు తారక్ కు చూపించారా?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లోకి వార్-2తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 20 May 2025 6:07 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లోకి వార్-2తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఆ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు!
అయితే నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 నుంచి అప్డేట్ వస్తుందన్న విషయం తెలిసిన నుంచి ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానే దాని కోసం వెయిట్ చేశారు. చెప్పినట్లు నేడు మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. హృతిక్, తారక్ యాక్షన్ సీన్స్ తోనే మొత్తం నిండిపోయిన టీజర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కానీ ఇప్పుడు టీజర్ అప్డేట్ తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు హ్యాపీగా లేరని చెప్పాలి. ఎందుకంటే వారు ఒకటి అనుకుంటే.. మరొకటి జరిగింది అప్డేట్ విషయంలో. సాధారణంగా బర్త్ డే రోజు అప్డేట్ అంటే.. కేవలం తారక్ విజువల్స్ తో గ్లింప్స్ ను రిలీజ్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టీజర్ చూశాక అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
టీజర్ లో తారక్ తో హృతిక్ రోషన్ కు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు మేకర్స్. పోనీ ఇస్తే ఇచ్చారు కానీ.. బర్త్ డే కానుకగా టీజర్ ను రిలీజ్ చేశారు కదా.. కనీసం చివర్లో విషెస్ కూడా చెప్పలేదు. ముఖ్యంగా తారక్ వాయిస్ ఓవర్ తో హృతిక్ కు మేకర్స్ ఎలివేషన్ ఇవ్వడం.. అనేక మందికి మింగుడు పడలేదు. తారక్ లుక్స్ సరిగ్గా డిజైన్ చేయలేదని టాక్ వినిపిస్తోంది.
విజువల్స్ లో క్వాలిటీ మిస్ అయినట్లు.. వీఎఫ్ ఎక్స్ లో హడావుడి కనిపించిందనే చెప్పాలి. తారక్ ఉన్న సీన్స్ అన్నీ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్నవే. రైలు నుంచి దూకే సీన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా మొత్తానికి టీజర్ విషయంలో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గా సాటిస్ఫై అవ్వలేదు. నార్త్ వాళ్లకి ఓకే అవ్వొచ్చు.. కానీ సౌత్ వాళ్ళకి కాదు!
తారక్ బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజ్ అయితే.. కియారా బికినీ షాట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. దీంతో ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ కు టీజర్ ఫైనల్ కట్ ను చూపించారా లేదోనని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ట్రైలర్ తో నెగిటివ్ టాక్ ను తొలగించి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం మేకర్స్ కు ఎంతైనా ఉంది.
