అభిమానులకు తారక్ అభయహస్తం!
ఇంకా ఆయన మాట్లాడుతూ, `ఈ పాత్ర చాలా ప్రత్యేకమైనది. పాత్రలో చాలా ఎమోషన్ ఉంటుంది.
By: Tupaki Desk | 18 July 2025 3:35 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో `వార్ 2` చిత్రంతో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ విలన్ పాత్ర పోషిస్తున్నాడని ఖరారైంది. అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తారక్ టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అన్నయ్య పాత్ర ఎలా ఉటుందనే ఆతృత అంతకంతకు రెట్టింపవుతోంది. నిర్మాత ఇచ్చిన హింట్స్ ప్రకారం హీరో-విలన్ పాత్రలు ధీటుగా సాగుతాయని తెలుస్తోంది.
ఓ పాటలో ఇద్దరు పోటా పోటీగా డాన్సు చేసినట్లు క్లారిటీ వచ్చింది. కానీ తారక్ పాత్ర విషయంలో ఎక్కడో చిన్న అసంతృప్తి. ఆర్ ఆర్ ఆర్ తరహాలో ఏదైనా తప్పు జరుగుతుందా? అన్న అనుమానం అభిమానుల్ని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమాపై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ స్పై థ్రిల్లర్ లో తన పాత్రకు వచ్చిన తొలి స్పందన చూసి ఎంతో ఎగ్జైట్ అయినట్లు తారక్ తెలిపారు.
తాను పోషించిన అత్యంత శక్తింతవమైన పాత్రల్లో ఇదొకటిగా చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, `ఈ పాత్ర చాలా ప్రత్యేకమైనది. పాత్రలో చాలా ఎమోషన్ ఉంటుంది. అంతే శక్తివంతంగానూ కనిపిస్తుంది. నన్ను నా అభిమానులు ఇలాంటి పాత్రలో చూసి వాళ్లు కూడా ఎంతో సంతోషిస్తారని ఆశిస్తున్నాను. వాళ్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అన్న ఆసక్తి నాలో పెరిగిపోతుంది. ఆ విషయంలో ఊహించుకుంటనే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. నటుడిగా ఉండటం అన్నది నిజంగా ఒక వరం.
ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రేమను నటుడిగానే పొందగలం. నిజమైన ప్రేమను నటుడు మాత్రమే చూడ గలడు. ఇది ఎంతో చాలా విలువైన,అరుదైన అనుభూతి. వార్ 2 విషయంలో అదే అనుభూతికి గురవు తున్నాను. ఈ చిత్రం నన్ను పూర్తిగా కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లింది. సినిమా షూట్ లో భాగమవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంది` అని అన్నారు. తారక్ మాటలని బట్టి పాత్ర విషయంలో ఆయన వందశాతం సంతృప్తిగా కనిపిస్తున్నారు. మరి తారక్ పాత్ర అభిమానుల్ని ఎంతగా అలరిస్తుందో చూడాలి.
