ఎన్టీఆర్ 'వార్-2'.. ఇంకెప్పుడు సారూ?
హృతిక్- తారక్ తో ఓ సాంగ్ ను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 5:43 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఆ సినిమాను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్-2ను ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇంకాస్త షూటింగ్ పెండింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. కొన్ని సీన్స్ ను ఇప్పుడు మేకర్స్ షూట్ చేస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హృతిక్- తారక్ తో ఓ సాంగ్ ను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆ సాంగ్ తో సినిమాకు వావ్ ఫ్యాక్టర్ ను యాడ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. జులై ఫస్ట్ వీక్ లో చిత్రీకరించనున్నారని సమాచారం. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా.. అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పాలి.
హై ఎండ్ యాక్షన్ అండ్ విజువల్స్ ఉన్నప్పటికీ.. తెలుగులో బజ్ ఎక్కువగా క్రియేట్ అవ్వలేదు. దీంతో సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్ -2 మూవీకి ఏకైక ఆకర్షణ జూనియర్ ఎన్టీఆర్. అందుకే దక్షిణాది వ్యూహాన్ని త్వరగా మేకర్స్ అమలు చేయాలి. సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేయాలి.
ఎందుకంటే డైరెక్టర్ కు నార్త్ లో ఉన్నంత బ్రాండ్ వాల్యూ సౌత్ లో ఉండదు. కాబట్టి ఎన్టీఆరే మెయిన్ పిల్లర్ గా మూవీని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రిలీజ్ కు నెల పైన ఉంది. అందుకే ప్రమోషన్స్ లో వేగం పెంచాలి. తెలుగు ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయకపోతే.. మార్కెట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అదే సమయంలో వార్-2 మూవీ రిలీజ్ అయ్యే రోజు కూలీ మూవీ కూడా సందడి చేయనుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే ధీమాను మేకర్స్ ప్రమషన్స్ తో క్రియేట్ చేశారు. కాబట్టి వార్-2 మేకర్స్ కూడా సందడి చేయాల్సిందే. ఇంకెప్పుడూ సారూ అంటూ నెటిజన్లు అడుగుతున్నారు.
