'వార్ 2' లో తారక్ తెర మీదకొచ్చేదప్పుడే!
'వార్ 2' భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.
By: Tupaki Desk | 16 July 2025 5:59 PM IST`వార్ 2` భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. దీంతో హృతిక్ రోషన్ -తారక్ పాత్రలు ఎలా ఉంటాయి? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది. ఇందులో హీరో హృతిక్ రోషన్ కాబట్టి ఆ పాత్ర పరంగా చూసే పనిలేదు. తారక్ ప్రతి నాయకుడు పాత్ర కావ డంతో? అతడి పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై తెలుగు ఆడియన్స్ లో ఒకటే ఉత్కంఠ మొదలైంది. పాత్రలో ఏమాత్రం తేడా జరిగినా థియేటర్లు బద్దలైపోవడం ఖాయమే.
`ఆర్ ఆర్ ఆర్` సినిమా విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. రామ్ చరణ్ పాత్రకు ధీటుగా తారక్ రోల్ లేక పోవడంతో అభిమానులు థియేటర్ల తలుపులు బద్దలు కొట్టడం..తెరను చించేయడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `వార్ 2` లో తారక్ రోల్ పై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం హీరోలిద్దరి మధ్య దెబ్బలాట మామూలుగా ఉండదంటున్నారు. తారక్ విలన్ పాత్ర పోషించినా? సినిమా ప్రారంభమైన పావు గంటకే ఆ పాత్ర ప్రత్యక్షమవుతుందని నిర్మాత నాగవంశీ అంటున్నాడు.
తారక్ రోల్ పరిచయమైన దగ్గర నుంచి ముగింపు వరకూ ఒకే టెంపోలో ఆ రోల్ సాగుతుందిట. హీరో హృతిక్ రోషన్ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఆరోల్ ఉంటుందని..పేరుకే విలన్ తప్ప తారక్ రోల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందంటున్నారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ ఎత్తైతే..ఇద్దరు కలిసి డాన్సు చేయడం అన్నది సినిమాకు మరో ఎత్తులా నిలుస్తుందని ధీమా వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ప్రచారంతో తారక్ రోల్ పై హైప్ రెట్టింపు అవుతుంది.
అభిమానుల్ని ఏమాత్రం నిరుత్సాహ పరచుకుండానే తారక్ రోల్ ని డిజైన్ చేసి వదులుతున్నట్లు కని పిస్తుంది. మరి ఆ సంగతేంటో తేలాలంటే వచ్చే నెల 14 వరకూ వెయిట్ చేయాలి. ప్రస్తుతం తారక్ తెలు గులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
