Begin typing your search above and press return to search.

దేవర 2 ఇంకెప్పుడు?.. ఆ 9 నెలల గ్యాప్ లో కానిచ్చేస్తారా?

ఇవే కాకుండా జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ తోనూ ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా తెలీదు.

By:  Tupaki Desk   |   24 July 2025 3:00 AM IST
దేవర 2 ఇంకెప్పుడు?..  ఆ 9 నెలల గ్యాప్ లో కానిచ్చేస్తారా?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల వార్ 2 సినిమా పూర్తి చేసుకున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత తారక్ మళ్లీ ఫుల్ టైమ్ వర్క్ మోడ్ లోకి వెళ్లిపోతారు. ఆయన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటారు.

ఈ సినిమా 2026 జూన్లో విడుదల కానున్నట్ల మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఎన్టీఆర్ వరుస షెడ్యూళ్లలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇది పూర్తి చేస్తారని అంటున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ పౌరాణిక సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇది 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది.

ఇవే కాకుండా జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ తోనూ ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా తెలీదు. అయితే వీటితోపాటు ఆయన దేవర 2 కూడా చేయాల్సి ఉంది. గతేడాది దేవర తొలి పార్ట్ తో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్- కొరటాల శివ రెండో భాగాన్ని తెరకెక్కించాల్సి ఉంది.

దేవర సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని ఆ మధ్య ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సీక్వెల్ కోసం అటు కొరటాల శివ కూడా స్క్రిప్ట్‌ను పూర్తి చేసి ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. వరుస ప్రాజెక్టులు లైన్ లో ఉండటంతో కొరటాల శివకు ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అయితే, దేవర 2 సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి ఎన్టీఆర్ కు వచ్చే ఏడాది తగినంత సమయం ఉంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్- వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను త్వరగా పూర్చి చేసి 2026 వేసవిలో విడుదలకు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత, త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ మధ్యలో దేవర 2 సినిమా కోసం తారక్ కు దాదాపు తొమ్మిది నెలల సమయం లభిస్తుంది. ఈ గ్యాప్ లో దేవర 2 కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.