నాలుగేళ్లలో యంగ్ టైగర్ నటవారసుడు?
ఇప్పుడు బాగా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడు విమానాశ్రయం నుంచి బయటకు వెళుతున్నప్పుడు తనతో పాటే పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా కనిపించాడు.
By: Tupaki Desk | 22 May 2025 11:48 AM ISTవిశ్వ విఖ్యాత నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ కుటుంబం నుంచి పలువురు నటవారసులు సినీపరిశ్రమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్నగారి వారసుడిగా నందమూరి బాలకృష్ణ అద్భుతమైన కెరీర్ జర్నీ, ఫాలోయింగ్ గురించి పరిచయం అవసరం లేదు. ఆ తర్వాతి జనరేషన్ లో ఉన్న ఏకైక ఆశాదీపంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రమే మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ రెండు దశాబ్ధాల కెరీర్ లో అంచెలంచెలుగా ఎదిగి నేడు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నాడు. ఈరోజు భారతదేశంలోని అసాధారణ మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఒకరిగా అతడు తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. త్వరలోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లాంటి భారీ యాక్షన్ చిత్రంతో వరల్డ్ వైడ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించనున్నాడు.
`వార్ 2` చిత్రీకరణ పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ మూవీ కోసం ఎన్టీఆర్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పుడు బాగా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడు విమానాశ్రయం నుంచి బయటకు వెళుతున్నప్పుడు తనతో పాటే పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా కనిపించాడు. అభయ్ వయసు 12. మరో నాలుగైదేళ్లలో అతడు కూడా టీనేజీ ప్రేమకథల్లో నటించేంత వయసు(16-సిక్స్ టీన్)కు చేరుకుంటున్నాడు. అయితే అభయ్ అకడమిక్ స్టడీస్ ని కొనసాగిస్తూ, నటనలోకి అడుగుపెడతాడా లేదా? అనేదానిపై కుటుంబం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
మాస్టర్ అభయ్ రామ్ కూడా ఎన్టీఆర్ లా స్టైలిష్ గా చరిష్మాటిక్ గా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే టీనేజీలో అడుగుపెడుతున్నాడు గనుక విద్యాభ్యాసంపైనే పూర్తిగా ఫోకస్ చేస్తాడని భావిస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని నడిపించే మూడో తరం నటవారసుడిగా అభయ్ బరిలో దిగుతాడా లేదా? దీనికోసం నటశిక్షణ కొనసాగుతోందా లేదా? అన్నదానికి ఇంకా స్పష్ఠత లేదు. అటు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అలాగే జానకి రామ్ వారసుడు బరిలోకి దిగాడు. ఇలాంటి సమయంలో యంగ్ టైగర్ వారసుడు కూడా ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అభయ్ రామ్ ఇంకా చిన్నపిల్లాడే గనుక .. తొందర పడి ఒక కోయిల ముందే కూయడం సరికాదనే భావన ఉంది.
