ఎన్టీఆర్-నీల్ మూవీ లేటెస్ట్ అప్డేట్
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 7:35 AMఆర్ఆర్ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్, ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ లో పెరిగాయి. దేశ విదేశాల్లో కూడా ఎన్టీఆర్ కు అభిమానులున్నారనే విషయం ఆర్ఆర్ఆర్ తర్వాతే తెలిసింది. ఆ తర్వాత దేవర సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో భాగంగానే తారక్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో ఎన్టీఆర్ వార్2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు ఎన్టీఆర్. ఆగస్ట్ లో వార్2 ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రస్తుతం ఎన్టీఆర్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తర్వాతి షెడ్యూల్ జూన్ మూడో వారం నుంచి మొదలు కానున్నట్టు సమాచారం.
ఓ స్పెషల్ సెట్ లో ఈ షెడ్యూల్ ను నీల్ తెరకెక్కించనున్నాడట. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలతో పాటూ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేయనున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటూ ప్రకాష్ రాజ్, కీలక తారాగణం కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, డ్రాగన్ ను ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలపాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నాడట. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ పై నీల్ చాలా గట్టిగానే టైమ్ వెచ్చించాడు. ఎన్టీఆర్ ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త అవతారంలో నీల్ ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.