Begin typing your search above and press return to search.

పెద్ద పొజిష‌న్ కోసం పిల్ల‌ల్ని క‌న‌ని స్టార్ హీరో

ఈ హీరో ప‌రిశ్ర‌మ‌లో చెప్పుకోద‌గ్గ పాత్ర‌ల‌తో త‌న‌దైన ముద్ర వేసాడు. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి న‌టుడిగా ఎదిగాడు.

By:  Tupaki Desk   |   15 July 2025 9:37 AM IST
పెద్ద పొజిష‌న్ కోసం పిల్ల‌ల్ని క‌న‌ని స్టార్ హీరో
X

ఈ హీరో ప‌రిశ్ర‌మ‌లో చెప్పుకోద‌గ్గ పాత్ర‌ల‌తో త‌న‌దైన ముద్ర వేసాడు. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి న‌టుడిగా ఎదిగాడు. కాంపిటీష‌న్ ఉన్నా స్టార్ హీరోగా త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. అయితే స‌హ‌న‌టితో దాదాపు 10 ఏళ్లు పైగా డేటింగ్ చేసిన అత‌డు ఎప్పుడూ త‌న‌కంటూ ఒక ఫ్యామిలీ ఉండాల‌ని ప్లాన్ చేయ‌లేదు. ఆ త‌ర్వాత గాళ్ ఫ్రెండ్ నుంచి విడిపోయాడు.

అలా విడిపోయిన కొన్నేళ్ల‌కు మ‌రో అంద‌మైన యువ‌తిని పెళ్లాడాడు. కానీ ఈ జంట‌కు పెళ్ల‌యి 11 ఏళ్లు అయినా కానీ, ఇప్ప‌టికీ పిల్ల‌లు క‌ల‌గ‌క‌పోవ‌డంపై చాలా మంది ప్ర‌శ్నించి విసిగిస్తున్నారు. అయితే

కెరీర్ చాలామందిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. పిల్ల‌ల కోసం త‌మ స‌ర్వ‌స్వాన్ని ఇవ్వాల‌నుకుంటారు చాలామంది. దాని కార‌ణంగా పెళ్ల‌యిన వెంట‌నే పిల్ల‌ల్ని క‌నేయాల‌ని కూడా అనుకోరు. పిల్ల‌ల‌కు ఎలాంటి క‌ష్టం తెలియ‌నీకూడ‌ద‌ని వారి కోసం ముందే చాలా పెద్ద ప్రీసెట‌ప్ చేయాల‌ని ఆశ ప‌డ‌తారు. అదే కోవ‌లో ఆలోచించిన ఈ సెల‌బ్రిటీ జంట కూడా పిల్ల‌ల్ని క‌న‌కుండా తాత్సారం చేసేసారు. ఇదంతా ఎవ‌రి గురించి అంటే....

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం - ప్రియ రుంచల్ జంట గురించి. ఈ జంట‌ వివాహం చేసుకుని 11 సంవత్సరాలకు పైగా అయింది.. కానీ ఇప్ప‌టికీ కుటుంబాన్ని ప్లాన్ చేయ‌కపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే దీనికి కార‌ణం త‌న కంపెనీల‌ను విస్త‌రించే ప‌నిలో ఉన్నాన‌ని, నిర్మాణ సంస్థ‌పై దృష్టి సారించాన‌ని జాన్ చెబుతున్నాడు. ప్ర‌స్తుతం నా ఆఫీస్ లు, వ్య‌వ‌స్థ‌ల‌ను సరిగ్గా సెట్ చేయ‌డంపైనే దృష్టి పెడుతున్నానని అన్నాడు. అలాగే తాను ప‌రిపూర్ణ భాస్వామిని కాదు అని కూడా అంగీక‌రించాడు. త‌న భార్య ఎంతో మంచిది.. స్థిర‌త్వంతో తెలివిగా ఆలోచిస్తుంద‌ని జాన్ అబ్ర‌హాం అన్నాడు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC పేరుతో ఒక ఫుట్ బాల్ టీమ్ త‌న‌కు ఉంది. సినిమాల నిర్మాణంతో పాటు, న‌టుడిగాను బిజీగా ఉన్నాడు. లైఫ్ లో చాలా స‌మ‌యం తీసుకునే ప‌నులే చేస్తున్నాన‌ని అన్నాడు. ఒక‌సారి వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ప్రారంభ‌మ‌య్యాక మ‌నం వేరే లెవ‌ల్ కి చేరుకుంటామ‌ని చెప్పాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్ అబ్ర‌హాం చివరిసారిగా `ది డిప్లొమాట్`లో కనిపించాడు. ఇది విమర్శకుల ప్రశంసలను పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగా ఆడింది.