Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్.. మరో రేంజ్ కి వెళ్లే ఆఫర్?

ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:00 AM GMT
జాన్వీ కపూర్.. మరో రేంజ్ కి వెళ్లే ఆఫర్?
X

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'ధడక్‌' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత 'గుంజన్‌ సక్సేనా, రూహి, మిలీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది.

ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా 'తంగం'అనే పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే దేవర నుంచి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే సౌత్ లో జాన్వీ కపూర్ నటిస్తున్న ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజా సమాచారం ప్రకారం జాన్వి కపూర్ సౌత్ లో తన రెండవ ప్రాజెక్టుగా ఓ తమిళ మూవీ సైన్ చేసినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో జాన్వి కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ మెహర కర్ణ అనే సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా ఈ సినిమాను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది.

ఇందులో కోలీవుడ్ స్టార్ సూర్యని హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంతేకాకుండా ఇందులో కర్ణుడి భార్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ని తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. సౌత్ లో మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి హీరోతో నటించే ఛాన్స్ అందుకున్న జాన్వికపూర్ ఇప్పుడు కోలీవుడ్ లో సూర్య లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ అందుకోవడం విశేషం అనే చెప్పాలి.

ఇక సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞాన్వెల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. UV క్రియేషన్స్ సంస్థ నిర్మాణ భాగస్వామి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.