Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోలిద్ద‌రు నో చెబితే ఆయ‌నోచ్చాడు!

ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి తెర‌కెక్కించారు. సినిమా ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి పూర్తిచేసే వ‌ర‌కూ ర‌క‌ర‌కాల స‌వాళ్లు ఎదుర్కున్నారు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:31 AM GMT
ఆ స్టార్ హీరోలిద్ద‌రు నో చెబితే ఆయ‌నోచ్చాడు!
X

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ధృవ న‌క్ష‌త్రం' ఎట్ట‌కేల‌కు రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 24న ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇప్ప‌టికే గౌత‌మ్ మీన‌న్ ప్ర‌చారం ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. రిలీజ్ కి ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉన్నా! అస‌లైన స్టార్ విక్ర‌మ్ మాత్రం ఇంకా ప్ర‌చార బ‌రిలోకి దిగ‌లేదు. ఆయ‌న మౌనం దేనికి సంకేతం? అన్న‌ది అర్దం కాని సందేహం.

మ‌రి రిలీజ్ అల‌స్య‌మైనా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ జోడీ ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందో చూడాలి. ఈ నేప‌థ్యంలో సినిమాకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టొచ్చింది. ఇందులో హీరోగా తొలుత విక్ర‌మ్ ని అనుకోలేదుట‌. సూర్య ని హీరోగా అనుక‌ని క‌థ సిద్దం చేసిన‌ట్లు గౌత‌మ్ మీన‌న్ తెలిపాడు. ఎందుక‌నో సూర్య ఈ క‌థ‌ని రిజెక్ట్ చేసాడుట‌. అటుపై ఇదే స్టోరిని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి నెరేట్ చేసారుట‌.

ఆయ‌న సానుకూలంగానే చేద్దాం అన్నారుట‌. కానీ చివ‌రి నిమిషంలో ఆయ‌న కూడా చేయ‌లేదుట‌. దీంతో నేరుగా విక్ర‌మ్ ని అప్రోచ్ అవ్వ‌డం..ఆయ‌న ఒకే చెప్ప‌డం ప‌ట్టాలెక్కించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అయితే ఇప్పుడు విక్ర‌మ్ ప్ర‌చారంలో పాల్గొన‌క‌పోవ‌డానికి...ఆ ఇద్ద‌రు స్టార్లు రిజెక్ట్ చేయ‌డానికి ఏదైనా సంబంధం ఉందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి తెర‌కెక్కించారు. సినిమా ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి పూర్తిచేసే వ‌ర‌కూ ర‌క‌ర‌కాల స‌వాళ్లు ఎదుర్కున్నారు.

షూటింగ్ స‌క్రమంగా జ‌ర‌గ‌క‌పోవ‌డం..అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం ఇవ‌న్నీ ఆటంకంగానే మారాయి. ఇప్పుడు విక్ర‌మ్ ప్ర‌చారానికి దూరంగా ఉండ‌టం? వెనుక కార‌ణాలు బ‌య‌ట‌కు రావ‌క‌పోవ‌డం. ఇదంతా ఓ మిస్ట‌రీగా ఉంది. మ‌రి ఈ మిస్ట‌రీకి విజ‌యం ఒక్క‌టే స‌మాధానం చెబుతుంది. గౌత‌మ్ మీన‌న్ కొంత కాలంగా సినిమాలు డైరెక్ట్ చేయ‌డం కంటే న‌ట‌న‌పై ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే.