ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన సెలబ్రిటీస్.. ఈమె కాస్ట్లీ గురూ..మరి లోయెస్ట్ ?
By: Tupaki Desk | 14 July 2026 4:00 PM ISTఇటీవల కాలంలో బుల్లితెర మొదలుకొని వెండితెర వరకూ కొంతమంది సెలబ్రిటీలు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది కూడా. మరి ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీస్ ఎవరు? ఎవరి ఇన్‌స్టాగ్రామ్ ను మనం చూడాలి అంటే ఎంత చెల్లించాలి ? అలా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన సెలబ్రిటీస్ ఎవరు? వారిలో హైయెస్ట్ ఎవరు? లోయెస్ట్ ఎవరు? అనే విషయాలు తెలియాలి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కి కావలసిన అర్హతలు..
ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టాలి అంటే ముందుగా కావాల్సిన అర్హతలు ఏంటి? అనే విషయానికొస్తే.. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కి కనీసం 10,000 మంది ఫాలోవర్లు ఉండాలి . పైగా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఒక క్రియేటర్ లేదా బిజినెస్ అకౌంటు అయి ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీలు , కమ్యూనిటీ స్టాండర్డ్స్, కంటెంట్ మానిటైజేషన్ పాలసీలను కచ్చితంగా పాటిస్తుంటే ఇంస్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన సెలబ్రిటీస్..
సెలబ్రిటీస్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే.. మరొకవైపు ఇలా సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే కొంతమంది మరో మెట్టు ఎక్కి.. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టారు. అలా ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన వారిలో నేహా శర్మ, విష్ణుప్రియ భీమినేని, పాయల్ రాజ్ పుత్, అనన్య నాగళ్ళ, నందిత శ్వేత వంటి సెలబ్రిటీలు ఈ జాబితాలో చేరారు.
సెలబ్రిటీస్ ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ధర..
విష్ణు ప్రియ:
ముఖ్యంగా ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కో ధరతో ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టారు. విష్ణు ప్రియ భీమినేని రూ.399 రూపాయలతో ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టి హైయెస్ట్ పెయిడ్ కలెక్టర్గా మొదటి స్థానంలో నిలిచింది. పైగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈమెకు సుమారుగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. అందులో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా సుమారుగా 7,400 సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
అనన్య నాగళ్ళ:
అందం , అభినయంతో ఆకట్టుకునే అనన్య నాగళ్ళ నెలకు రూ.390 తో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టింది. ఈమె 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది.పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే 600 మంది సబ్‌స్క్రైబర్లు వచ్చి చేరడం గమనార్హం.
నందిత శ్వేత:
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 14 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఈమె నెలకు రూ.399 తో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టింది.
నేహా శర్మ:
ఇకపోతే ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ కూడా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టింది. అయితే కేవలం నెలకు రూ.290 తో మాత్రమే ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టడం గమనార్హం. ఈమెకు సుమారుగా 10,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంటే నెలకు 29 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
