Begin typing your search above and press return to search.

యుద్ధ వాతావరణంలో.. బడా మూవీలు డౌటే?

అయితే భారత్, పాక్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్ ను నిరవధిక వాయిదా వేసినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా పలు సినిమాల రిలీజ్ లు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 May 2025 4:20 PM IST
యుద్ధ వాతావరణంలో.. బడా మూవీలు డౌటే?
X

జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. అనేక ఆంక్షలు విధించిన భారత్, ఇటీవల పాక్ లోని ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చింది. దీంతో అది తట్టుకోలేని దాయాది దేశం గురువారం రాత్రి మెరుపు దాడి చేయగా, వాటిని సమర్థంగా తిప్పికొట్టి చుక్కలు చూపించింది భారత్.

అయితే భారత్, పాక్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్ ను నిరవధిక వాయిదా వేసినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా పలు సినిమాల రిలీజ్ లు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక సినిమాల షూటింగ్స్ కు బ్రేకులు కూడా పడే పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఉత్తరాది పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. దీంతో కొన్ని చిత్రాల షూటింగ్స్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మే, జూన్ నెలల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన బిగ్, మీడియా బాలీవుడ్ మూవీల విడుదలను వాయిదా వేసే యోచనలో ఆయా చిత్రాల మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో హిందీ మార్కెట్ పై ఆశలతో ఉన్న మిగతా ఇండియన్ ఫిల్మ్స్ మేకర్స్ కూడా తమ సినిమాల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు ఇవ్వనున్నారని టాక్. అయితే సౌత్ సినిమాల్లో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్నాయి.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ కింగ్ డమ్, శేఖర్ కమ్ముల- ధనుష్ కుబేర సహా పలు చిత్రాలు ఉన్నాయి. ఆయా సినిమా మేకర్స్.. హిందీ మార్కెట్ పై నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అటు బాలీవుడ్ చిత్రాలు పంజాబ్ 95, కేసరి వీర్, మాలిక్, సితారే జమీన్ పర్, మా, నికితా రాయ్, హౌస్ ఫుల్ 5 సహా అనేక ప్రాజెక్టులు విడుదల తేదీలను ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ వార్-2 ఆగస్టులో రిలీజ్ కానుంది. మరి ఆయా సినిమా మేకర్స్.. ఏం చేస్తారో.. ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో.. పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాలి.