Begin typing your search above and press return to search.

ఫైటర్ విషయంలో తేడా కొడుతుందే..!

సంక్రాంతికి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు వస్తున్న ఫైటర్ సినిమా పై ఇప్పటివరకు ఉన్న బజ్ అయితే అంత గొప్పగా లేదు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 7:35 AM GMT
ఫైటర్ విషయంలో తేడా కొడుతుందే..!
X

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. అయితే హృతిక్ సినిమాకు రావాల్సినంత క్రేజ్ ఫైటర్ కు రావట్లేదని చెప్పొచ్చు. ఫైటర్ సినిమా భారీ యాక్షన్ మూవీగా వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్రతిదీ చాలా భారీగా ప్లాన్ చేశారు.

సంక్రాంతికి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు వస్తున్న ఫైటర్ సినిమా పై ఇప్పటివరకు ఉన్న బజ్ అయితే అంత గొప్పగా లేదు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సిద్ధార్థ్ ఆనంద్ లాస్ట్ ఇయర్ పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ క్రేజ్ తో అయినా ఫైటర్ కి విపరీతమైన బజ్ ఏర్పడాల్సి ఉంది. కానీ ఎందుకో ఫైటర్ విషయంలో తేడా కొట్టేస్తుంది.

ఫైటర్ సినిమాలో అనీల్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ డే భారీ కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే కానీ ఫైటర్ మీద ఆడియన్స్ ఆసక్తి పెరిగే అవకాశం ఉండదని అనిపిస్తుంది. హృతిక్ మాత్రం ఫైటర్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. విక్రం వేద తర్వాత హృతిక్ రోషన్ టైగర్ 3 లో క్యామియో రోల్ చేశాడు. ఫైటర్ కోసం రెండేళ్లుగా హృతిక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సినిమా ప్రచార చిత్రాలు బాగానే ఉన్నా ఆడియన్స్ ఇంకా ఏదో ఆశిస్తున్నారు. అయితే ట్రైలర్ తో వారి అంచనాలను పెంచేలా చేస్తున్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఓ పక్క రణ్ బీర్ కపూర్ యానిమల్ తో 900 కోట్ల దాకా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించగా హృతిక్ కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఫైటర్ తో హృతిక్ స్టామినా ప్రూవ్ కాబోతుంది.

ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్ వార్ 2 లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.