Begin typing your search above and press return to search.

హీరో గాళ్ ప్రెండ్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తుందా?

స‌ల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్...షారుక్ ఖాన్ లాంటి హీరోలు చాలామంది అదే లుక్ లో క‌నిపించిన సంద‌ర్భాలున్నాయి.

By:  Tupaki Desk   |   20 April 2024 8:30 AM GMT
హీరో గాళ్ ప్రెండ్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తుందా?
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ క‌టౌట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ దేహం..మెలి తిరిగిన కండ‌లు...ఉబ్బెత్తిన న‌రాలు..టైట్ మ‌జిల్స్... సిక్య్ ప్యాక్ లుక్ తో మాములుగా ఉండ‌దు. ఎంత మంది హీరోలు సిక్స్ ప్యాక్ ఉన్నా? హృతిక్ ప్యాక్ మాత్రం అంద‌రికంటే హైలైట్ అవుతుంది. కొన్ని ద‌శాబ్ధ‌లుగా అలా మెయింటెన్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. స‌ల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్...షారుక్ ఖాన్ లాంటి హీరోలు చాలామంది అదే లుక్ లో క‌నిపించిన సంద‌ర్భాలున్నాయి.

కానీ హృతిక్ లా ఎవ్వ‌రూ మెయింటెన్ చేయ‌లేదు. మిగ‌తా వారంతా అవ‌స‌రం మేర పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు మౌల్డ్ అవుతారు త‌ప్ప‌! గ్రీక్ గాడ్ లో అంద‌మైన శ‌రీరాకృతికి మాత్రం నిత్యం క‌లిగి ఉండ‌లేరు. అందుకే బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోష‌న్ అంటే అంద‌రికీ సంథింగ్ స్పెష‌ల్. మ‌రి ఆ రాకుమారుడు ప్రియురాలు కూడా అంతే అందంగా అలాగే ఉండాలి క‌దా. భార్య‌తో విడాకుల త‌ర్వాత హృతిక్ రోష‌న్ సబా ఆజాద్ కి ద‌గ్గరైన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. పెళ్లి చేసుకుంటున్న‌ట్లు కూడా వార్త‌లొస్తున్నాయి.

కానీ అది ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే హృతిక్ ప్రియురాలు అంటే? ఆషామాషీగా ఉంటే కుద‌ర‌దు క‌దా. అందుకే హృతిక్ ఇప్పుడు ప్రియురాల్ని త‌న‌లా మార్చే బాధ్య‌త తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బేసిక్ గానే స‌బా అజాద్ స‌న్న‌ని సోయగంలా ఉంటుంది. హృతిక్ హైట్ ని మ్యాచ్ చేస్తుంది గానీ ఫిజిక్ ప‌రంగా బ‌ల‌హీనంగానే క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో స‌బా కూడా ఫిట్ నెస్ పై స్పెష‌ల్ పోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిగో ఇక్క‌డిలా జిమ్ములో అమ్మ‌డు గంట‌ల త‌ర‌బ‌డి శ్రమిస్తుంది. ప్రియుడు త‌ర‌హాలోనే బాడీ ని సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారుస్తుంది. శ‌రీరంలో అన‌వ‌స‌ర‌పు ప‌దార్ధాల‌న్నింటిని వేగంగా బ‌య‌ట‌కు పంపించేందుకు సీరియ‌స్ గానే క‌ష్ట‌ప‌డుతుంది. స‌బా శ‌రీరంలో మార్పులిక్క‌డ గ‌మ‌నించ‌వ‌చ్చు. మునుప‌టి కంటే మ‌రింత టోన్డ్ బాడీ లుక్ లో క‌నిపిస్తుంది. ప‌క్క‌టెముకుల్లో ప్యాట్ పూర్తిగా క‌రిగిపోయింది. జిమ్ములో సెల్పీ దిగిన ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప‌క్క‌నే హృతిక్ లుక్ కూడా ఉండ‌టంతో అత‌డికి పోటీగా ట్రై చేస్తుందా? అన్న సందేహం రాక‌మాన‌దు.