హృతిక్ విగ్గు ధరించడు ఒరిజినల్ జుట్టే
చాలా మంది తెలుగు హీరోలు ఒరిజినల్ జుట్టుతో కాకుండా, విగ్గులు వాడుతుంటారని కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 20 Jun 2025 10:46 AM ISTచాలా మంది తెలుగు హీరోలు ఒరిజినల్ జుట్టుతో కాకుండా, విగ్గులు వాడుతుంటారని కథనాలొచ్చాయి. ఇప్పుడు వార్ 2 నటుడు హృతిక్ రోషన్, టీవీ హోస్ట్ కపిల్ శర్మ వంటి సెలబ్రిటీలు విగ్గులు వాడుతున్నారనే పుకార్లపై సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ స్పందించారు. ఇటీవల హిందీ రష్ తో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ ఇద్దరు సెలబ్రిటీలు సహజంగానే గొప్ప జుట్టు కలిగి ఉంటారని, విగ్గులు ధరించరని ధృవీకరించారు. జూనియర్ ఎన్టీఆర్ తో వార్ 2లో హృతిక్ ఒరిజినల్ హెయిర్ తోనే కనిపిస్తున్నారని దీనిని బట్టి క్లారిటీ వచ్చింది.
నేను పుకార్లు వింటూనే ఉన్నాను.. కానీ హృతిక్, కపిల్ శర్మ విగ్గులు ధరించరని, హెయిర్ ప్యాచ్ లు పెట్టుకోరని ఆలియ్ హకీమ్. ``నా జుట్టు నకిలీది కావొచ్చేమో కానీ, వారిది కాదు`` అని ఆలిమ్ హకీమ్ తన బట్టతలపై నిమురుతూ కనిపించాడు. వారు విగ్గులు ధరిస్తారని తప్పుగా ప్రచారం సాగుతోందని ఆలిమ్ తెలిపారు. వారికి జుత్తు కత్తిరించే వ్యక్తిగా చెబుతున్నాను. నకిలీ జుట్టు కెమెరాలో నిజమైన జుట్టులాగా రియాక్ట్ అవ్వదు. వార్‌లో హృతిక్ ఛాపర్ దగ్గర సీన్ లో చూడండి.. నాణ్యమైన ఒరిజినల్ జుట్టు అయితేనే అలాంటి ఫీల్ వస్తుందని ఆలిమ్ అన్నారు.
త్వరలో హృతిక్, ఎన్టీఆర్ వార్ సీక్వెల్- వార్ 2లో కనిపిస్తారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 14 ఆగస్టు 2025న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల అవుతుంది. టీజర్ ఇప్పటికే విడుదలైంది. హృతిక్ తన కబీర్ పాత్రతో రీఎంట్రీ ఇస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో తారక్ నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
