Begin typing your search above and press return to search.

GO: అలా అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

By:  Tupaki Desk   |   16 March 2024 12:56 PM GMT
GO: అలా అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్
X

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. ఇటీవల గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న గామి చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం గామి టీమ్ అంతా సక్సెస్ జోష్ లో ఉంది. ఇటీవల తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది.

ఇక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం కంటిన్యూగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దేశమంతా ఎన్నికల నోటిఫికేషన్ హడావుడి నెలకొన్న సమయంలో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సమ్మర్ కానుకగా మే 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి ఒడ్డు నుంచి అత్యంత కఠినమైన, హింసాత్మక కథను చూడడానికి సిద్ధంగా ఉండండంటూ క్యాప్షన్ ఇచ్చి విశ్వక్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే పోస్టర్.. బ్యాక్ గ్రౌండ్ లో రాజమండ్రి గోదావరి వంతెనతో అదిరిపోయింది. విశ్వక్ లుక్.. వేరే లెవల్ లో ఉంది. నది ఒడ్డున ఇసుకలో లుంగీ కట్టు, బ్లాక్ గూగుల్స్ పెట్టుకున్న విశ్వక్ యుద్ధంలో దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. నోటిలో బీడీతో మాస్ లుక్ లో దుమ్ము దులిపేశారు విశ్వక్. మొత్తానికి ఈ పిక్ ద్వారా మేకర్స్ మాస్ ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.

విశ్వక్ పోస్టర్ ఓ రేంజ్ లో ఉందని, సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగిపోయాయని నెటిజన్లు అంటున్నారు. మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పోస్టర్ ను రీ షేర్ చేస్తూ మాస్ కా బాప్ అంటూ క్యాప్షన్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో విశ్వక్ సేన్ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటిస్తుండగా.. తెలుగు అందం అంజలి కీలకపాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్.. స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిపోతాయి. కానీ దేశంలో మరో మూడు విడతల ఎన్నికలు ఉంటాయి. మొత్తానికి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.