Begin typing your search above and press return to search.

గోదావరి గ్యాంగ్ తో డబుల్ ఇస్మార్ట్ ఫైట్..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పోటీ పడుతుంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 9:10 AM GMT
గోదావరి గ్యాంగ్ తో డబుల్ ఇస్మార్ట్ ఫైట్..!
X

ఒక సినిమా అనుకున్న రిలీజ్ డేట్ కు రాకుండ వాయిదా పడి వేరే డేట్ కు వస్తే.. ఆల్రెడీ ఆ డేట్ కి మరో సినిమా రిలీజ్ కన్ఫర్మ్ చేస్తే. రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ కచ్చితంగా జరుగుతుంది. స్టార్ హీరోల మధ్యే కాదు మీడియం రేంజ్ హీరోల మధ్య కూడా ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటి ఒక ఫైట్ బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పోటీ పడుతుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అసలైతే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. సలార్ సినిమా రిలీజ్ వాయిదా పడటం డిసెంబర్ రిలీజ్ అనుకున్న సినిమాలు కొన్ని ముందుకు కొన్ని వెనక్కి వెళ్లడం జరిగింది. సో అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.

సితార వాళ్లు ఫైనల్ గా ఈ సినిమాను మార్చి 8న రిలీజ్ లాక్ చేశారు. మరోపక్క రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా అనౌన్స్ మెంట్ రోజే మార్చి 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. రామ్ పూరీ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో సంజయ్ దత్ లాంటి స్టార్ నటిస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాకు పోటీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తుంది.

రెండు సినిమాలు ఇద్దరి హీరోలకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చేలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కాబట్టి రామ్ సినిమాపై ఆడియన్స్ ఆల్రెడీ మంచి అంచనాలతో ఉన్నారు. అయితే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కూడా ప్రచార చిత్రాలు సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచాయి. రెండు సినిమాల మధ్య ఫైట్ కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఎంచుకున్న కథను కన్విన్స్ గా తీయగలిగితే చాలు ఆడియన్స్ ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, రామ్ ఇద్దరు కూడా తమ సినిమాల మీద పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.