Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్.. ఇది విశ్వక్ మాస్ జాతర

ఇక ఇప్పుడు ట్రైలర్ ద్వారా అంచనాల స్థాయిని మరింత పెంచారు.

By:  Tupaki Desk   |   25 May 2024 2:00 PM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్.. ఇది విశ్వక్ మాస్ జాతర
X

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ఉన్న పాజిటివ్ వైబ్స్, సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్ప ఫలితాలను అందించేలా ఉన్నాయి. విశ్వక్ సేన్ ఎంచుకునే కథలు ఎప్పుడూ కూడా వినూత్నంగా ఉంటాయని తెలిసిందే. GOG కూడా డిఫరెంట్ యాక్షన్ ఎమోషనల్ సీన్స్ తో అలరించేలా ఉన్నట్లు ఇదివరకే టీజర్ ద్వారా అర్థమయింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ద్వారా అంచనాల స్థాయిని మరింత పెంచారు.

విశ్వక్ సేన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, ప్రేక్షకులకు నిత్యం కొత్తదనాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గామి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా నటుడిగా విశ్వక్ స్థాయిని పెంచింది. అఘోరా పాత్రలో ప్రయోగాలు చేసి, తన ధైర్యాన్ని నిరూపించాడు.

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ చేసే పాత్ర హై వోల్టేజ్ వైబ్రేషన్స్ కలిగించేలా ఉండబోతుంది. సాధారణ యువకుడు, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్‌ ని ఎదిరించి, చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన కథతో ఈ సినిమా ఉండబోతోంది. విశ్వక్ పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉండబోతున్నట్లు స్పష్టమైంది. అడ్డదారిలో వెళ్లే వారికి ధీటుగా హీరో క్యారెక్టర్ కౌంటర్ గా ఉండబోతున్నట్ల తెలుస్తోంది.

లంక గ్రామానికి చెందిన రత్న అనే యువకుడి కథగా ఈ సినిమా రూపొందింది. ఒక కారణంతో పాలిటిక్స్ లోకి వెళ్లిన హీరో ఎలాగైనా గెలిచి తీరాలని అడుగులు వేస్తూ ఉంటాడు. ఇక శత్రువులు వేసే ప్లాన్స్ ను అతను ఎలా తిప్పి కొట్టాడు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే" అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది.

విశ్వక్ లంకల రత్నగా ఊర మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. లంకల రత్న ఏం చేశాడు? ఊరంతా ఎందుకు అతడిని వెంటాడుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటోందని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఇక అంజలి పాత్ర కూడా బోల్డ్ గా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇక విశ్వక్ కూడా కొన్ని బూతులతో షాక్ ఇచ్చాడు.

విశ్వక్ సేన్ పాత్ర, కృష్ణ చైతన్య మేకింగ్ విధానం విజువల్స్‌తో కూడా హైలైట్ అయ్యాయి. కృష్ణ చైతన్య పాటల రచయితగా మంచి గుర్తింపును పొందిన తర్వాత, దర్శకుడిగా రౌడీ ఫెలోతో ఎంట్రీ ఇచ్చాడు. "చల్ మోహనరంగ" సినిమాతో కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కృష్ణ చైతన్య, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో యాక్షన్ డ్రామా, ఎమోషన్స్ హైలైట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను మే 31న వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.