Begin typing your search above and press return to search.

GOG - మాస్ నాయకుడు వచ్చేస్తున్నాడు

ఇక ఇప్పుడు ట్రైలర్ ద్వారా మరింత స్టఫ్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ట్రైలర్ ను దేవి 70MM థియేటర్ లో 4 గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతోంది.

By:  Tupaki Desk   |   25 May 2024 6:27 AM GMT
GOG - మాస్ నాయకుడు వచ్చేస్తున్నాడు
X

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఇప్పటికే పోస్టర్స్ టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. లంక గ్రామానికి చెందిన రత్న అనే యువకుడి కథగా ఈ చిత్రం రూపొందుతోంది. విశ్వక్ సేన్ పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొడతాడని తెలుస్తోంది. "అమ్మోరు పూనేసింది రా, ఈసారి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే" అని ఆయన చెప్పిన డైలాగ్ మాస్ ఆడియెన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్‌ను ఎదిరించే హీరోగా కనిపించనున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండబోతుందని, ఇది ప్రేక్షకులను కొత్త తరహా అనుభూతి ఇస్తుందని టీజర్ ద్వారా అర్థమైంది. ఇక ఇప్పుడు ట్రైలర్ ద్వారా మరింత స్టఫ్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ట్రైలర్ ను దేవి 70MM థియేటర్ లో 4 గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతోంది.

ఇక దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను అద్భుతంగా మలచారని టీజర్ విజువల్స్ చూస్తే తెలుస్తోంది. కృష్ణ చైతన్య తన మేకింగ్ విధానం, విశ్వక్ క్యారెక్టర్ హైలైట్స్‌తో ఈ సినిమా పట్ల మంచి హైప్ క్రియేట్ చేశారు. కృష్ణ చైతన్య గతంలో "రౌడీ ఫెలో" మరియు "చల్ మోహనరంగ" వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"తో మరొక మైలురాయిని చేరుకోబోతున్నారు.

ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక పోస్టర్ లో విశ్వక్ డెత్తిలిష్ కళ్ళజోడు పెట్టుకొని పంచె కట్టులో మాస్ నాయకుడిగా కనిపిస్తున్నాడు. విశ్వక్ సేన్ గతంలో "గామి" వంటి ప్రయోగాత్మక పాత్రలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పుడు లంకల రత్న పాత్రలో నటిస్తూ మరింత భిన్నమైన పాయింట్‌ తీసుకురానున్నాడు. పాటల రచయితగా గుర్తింపు పొందిన కృష్ణ చైతన్య, తన దర్శకత్వ ప్రతిభను "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ద్వారా మరింత చూపించబోతున్నాడు.

ఈ సినిమా మే 17న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసింది. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" టీజర్ ద్వారా క్రియేట్ అయిన అంచనాలు ట్రైలర్ ఎంతవరకు తీసుకు వెళుతుందో చూడాలి. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తు విషయం తెలిసిందే. అలాగే విశ్వక్ కొంత నెగిటివ్ షెడ్ లో కూడా హై వోల్టేజ్ సీన్స్ తో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం.