Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భలే సేఫ్ అయ్యింది

ఇది ఎంత మంచి నిర్ణయం అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాజాగా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ రిలీజ్ అయ్యింది

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:35 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భలే సేఫ్ అయ్యింది
X

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గోదావరి నేపథ్యంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ సిద్ధమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని డిసెంబర్ 8 రిలీజ్ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యారు.

ఎట్టి పరిస్థితిలో ఈ డేట్ కి రిలీజ్ ఖాయం అని అందరూ అనుకున్నారు. విశ్వక్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే నిర్మాత నాగవంశీ ఆలోచించి డిసెంబర్ 8 రిలీజ్ సేఫ్ కాదని వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. ఈ విషయంలో విశ్వక్ సేన్ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయిన నిర్మాత ఫైనల్ డెసిషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపించే టాక్.

ఇది ఎంత మంచి నిర్ణయం అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాజాగా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవనే మాట వినిపిస్తోంది. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దానిని బట్టి మూవీ కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ఇక నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ కూడా పాజిటివ్ టాక్ తోనే థియేటర్స్ లోకి వస్తోన్న ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని తెలుస్తోంది. ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. నాని, నితిన్ గత సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం వచ్చిన సినిమాలకి పాజిటివ్ బజ్ ఉన్న కూడా ఓపెనింగ్స్ పెద్దగా వచ్చేలా కనిపించడం లేదు.

ఈ సినిమాల పరిస్థితి చూసిన తర్వాత విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని నిర్మాత వాయిదా వేసి చాలా మంచి పని చేశారనే మాట వినిపిస్తోంది. ఈ టైమ్ లో రిలీజ్ అయ్యి ఉంటే హిట్ టాక్ వచ్చిన కమర్షియల్ గా లాస్ అయ్యే ప్రమాదం ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.