Begin typing your search above and press return to search.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. రిలీజ్ డౌట్ పై తేల్చేశారు

ఇక ఆయన తన తదుపరి చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:38 PM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. రిలీజ్ డౌట్ పై తేల్చేశారు
X

మాస్ కా దాస్ ట్యాగ్ తో యూత్ లో మంచి క్రేజ్ అందుకుంటున్న విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా కథనాన్ని టచ్ చేస్తూ ఉంటాడు. యాక్టింగ్ లో కూడా ఎప్పటికప్పుడు విభిన్నంగా ఉండేలా పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా థియేటర్ కు వచ్చే ఆడియెన్స్ కు మినిమామ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అతికొద్ది హీరోలలో విశ్వక్ ఒకరు.

ఇక ఆయన తన తదుపరి చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో నిర్మిస్తోంది. ఇక సినిమాను ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా అయితే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ పోతోంది.

అయితే ఈ సినిమా విడుదల డేట్ పై ఇన్ని రోజులు క్రియేట్ అయిన కన్ఫ్యూజన్ కు మొత్తానికి క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాని మొదట డిసెంబర్ లొనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ వెనక్కి తగ్గి ఇప్పుడు కొత్త డేట్ పై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని 2024 మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇదే సినిమాకు పర్ఫెక్ట్ డేట్ అని ఇటీవల నిర్ణయం తీసుకొని వెంటనే క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు 'సుట్టంలా సూసి' అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ టాలెంటెడ్ నటి అంజలి కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథగా తెరపైకి రాబోతోంది. జీవితంలో కఠినమైన ప్రయాణం అలాగే రాజకీయ చిక్కులను ఎలా ఎదుర్కొన్నాడు. అనే అంశాలు సినిమాలో ఆసక్తిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ నెవ్వర్ బిఫోర్ అనేలా గ్రే క్యారెక్టర్‌లో కనిపిస్తారు.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సుట్టంలా సూసి' సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ సంస్థలలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.