Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాల్లో ఆ కథను రీమేక్ చేస్తా: విశ్వక్ సేన్

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది, ముఖ్యంగా సినిమా పోస్టర్లు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి.

By:  Tupaki Desk   |   21 May 2024 1:23 PM GMT
ఎన్టీఆర్ సినిమాల్లో ఆ కథను రీమేక్ చేస్తా: విశ్వక్ సేన్
X

టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపు పొందిన యంగ్ హీరో విశ్వక్ సేన్, తన కొత్త చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. "ఛల్ మోహన్ రంగ" ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది, ముఖ్యంగా సినిమా పోస్టర్లు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పవర్ ఫుల్ రోల్ లో నటించనున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో విశ్వక్ రాజకీయ నాయకుడిగా కనిపించడం, నుదిటిన పెద్ద బొట్టు, చేతులెత్తి దండం పెట్టడం వంటి దృశ్యాలు ప్రేక్షకులలో ఆకాంక్షను పెంచాయి. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాలో రాజకీయ అంశం ప్రాముఖ్యంగా ఉంటుందని సమాచారం.

ఇటీవల విడుదల చేసిన లిప్ లాక్ సీన్ పోస్టర్ కూడా మంచి స్పందనను రాబట్టింది. సినిమా విడుదలకు ముందు ఈ విధమైన ప్రమోషన్లతో, మేకర్స్ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా యాంకర్ సుమతో కూడా చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్య, హీరోయిన్స్ నేహా శెట్టి, అంజలి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. ముందుగా అటెండెన్స్ తీసుకుంటున్నట్లు యాంకర్ సుమ ఒక టీచర్ తరహాలో వ్యవహరించుగా విశ్వక్సేన్ రాలేదు అని అతనే చెప్పాడు. మరి ఇక్కడ వచ్చి కూర్చున్నది ఆత్మనా అని సుమా అడగడంతో కాదు రత్న అని సినిమాలోని అతని క్యారెక్టర్ గురించి విశ్వక్ సమాధానం చెప్పేశాడు.

ఇంటర్వ్యూలో ఈ తరహా పంచులు చాలా గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు కట్టప్ప నేను అంటూ విశ్వక్ మాట్లాడగా అతను పైకి కోపంగా ఉన్నా లోపల మాత్రం ఒక టెడ్డీబేర్ లాంటి సున్నితమైన మనసు కలిగిన వాడు అని నేహా తనదైన శైలిలో పొగడ్తలతో ముంచేసింది. దర్శకుడు కృష్ణ చైతన్య కూడా పాపం చాలా మంచోడు అన్నట్లుగా డైలాగ్ చెప్పడంతో విశ్వక్ అప్పుడే తనలోనే మాస్ క్యారెక్టర్ ను బయటకు తీయడం కూడా హైలెట్ గా నిలిచింది.

ఒకవేళ మీరు ఎన్టీఆర్ సినిమాలలో ఏదైనా రీమేక్ చేయాలని అనుకుంటే దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు అని మరో ప్రశ్న అడగడంతో విశ్వక్ ఊహించిన విధంగా నా అల్లుడు రీమేక్ చేస్తానని అని చెప్పేసాడు. ఇక షూటింగ్లోని అనేక విషయాల గురించి హీరోయిన్ అంజలి కూడా మాట్లాడ సాగింది. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. రేపు ఫుల్ ఇంటర్వ్యూ ని యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.