Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అంజలి ఊరమాస్

అంజలితోపాటు డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 9:59 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అంజలి ఊరమాస్
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. శివరాత్రి కానుకగా విశ్వక్ యాక్ట్ చేసిన.. గామి చిత్రం విడుదలైంది. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. మాస్ కా దాస్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఛల్ మోహన రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. అంజలితోపాటు డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వాస్తవానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ.. నేడే(మార్చి 8వ తేదీ) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. త్వరలోనే సోలో గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్.. మూవీ లవర్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ విషెస్ తెలిపారు. దాంతోపాటు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో హీరోయిన్ అంజలి ఊరమాస్ లుక్ లో కనిపిస్తోంది. ఆమె చుట్టూ కొందరు మహిళలు ఆయుధాలు చేతపట్టి నిలుచున్నారు. ప్రస్తుతం అంజలి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంజలి పోస్టర్.. సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచుతుందని కామెంట్లు పెడుతున్నారు. శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

తెలుగమ్మాయిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది అంజలి. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. హోమ్లీ పాత్రలతో దివంగత నటి సౌందర్య లేని లోటు తీర్చింది. అయితే కెరీర్ స్టార్టింగ్ లో హోమ్లీ ఇమేజ్ తో ఆకట్టుకున్న అంజలికి ఆ ఇమేజే కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టింది.

దీంతో తన రూట్ ను మార్చేందుకు ట్రై చేస్తోంది అంజలి. కానీ వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు మరింతగా సీరియస్ గా ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలో ట్రెండీ ఔట్ ఫిట్స్ తో ఫొటోలు దిగి పోస్ట్ చేస్తోంది. గ్లామర్ షో చేస్తోంది. ఇక త్వరలోనే గీతాంజలి మళ్లీ వచ్చింది, గేమ్ చేంజర్ మూవీలతో ప్రేక్షకులను అలరించనుంది. మరి అంజలి వరుస చిత్రాలు ఎలాంటి హిట్ అవుతాయో చూడాలి.