Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. కిక్కిచ్చే ఐటెమ్ సాంగ్ లో తెలుగంధం

గుంటూరు కారంలోని కుర్చీ మడత పెడితే సాంగ్ కాస్త ఊపు ఊపినా.. మిగతా సినిమాల్లోని పాటలు సోసో గానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:19 PM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. కిక్కిచ్చే ఐటెమ్ సాంగ్ లో తెలుగంధం
X

సంక్రాంతి సందడి ముగిసినట్లే. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వగా.. నా సామిరంగా కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ రెండు సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే పెద్ద పండక్కి వచ్చిన చిత్రాల్లో ఒక్క ఐటమ్ సాంగ్ కూడా లేకపోవడం గమనార్హం. గుంటూరు కారంలోని కుర్చీ మడత పెడితే సాంగ్ కాస్త ఊపు ఊపినా.. మిగతా సినిమాల్లోని పాటలు సోసో గానే ఉన్నాయి.

దీంతో సంక్రాంతి చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లేకపోవడం నిరాశకు గురైన అభిమానులకు గుడ్ న్యూస్. మాస్ దా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనుందట. మరో రెండు రోజుల్లోనే ఈ సాంగ్ షూట్ కూడా జరగనుందట. అసలే ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ తోడైతే హైప్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

విశ్వక్ సేన్ తో తెలుగు అందం ఈషా రెబ్బా చిందులు వేయనుందట. ఇప్పటికే చిత్రయూనిట్.. ఐటమ్ సాంగ్ షూట్ కోసం స్పెషల్ సెట్ ను కూడా రెడీ చేసిందట ఈ విషయం తెలుసుకున్న విశ్వక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్ టాప్ ఐటమ్ సాంగ్ లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈషా మంచి బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇక డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ అనగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ కు సమానంగా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఇప్పుడు మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుంది. మొత్తానికి ఈ సినిమాలో అంతా సౌత్ బ్యూటీలే ఉన్నారన్న మాట.

అయితే ఈ సినిమాను గతేడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దీంతో శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు సుట్టంలా సూసి అనే ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.