Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ తో వార్‌ పై స్పందించిన ఫైటర్‌

మంచి వసూళ్లు ఫైటర్ సినిమాకు వస్తున్నట్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:30 AM GMT
ఎన్టీఆర్‌ తో వార్‌ పై స్పందించిన ఫైటర్‌
X

బాలీవుడ్ సూపర్ స్టార్‌ హృతిక్ రోషన్‌ తాజాగా ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రివ్యూవర్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా కూడా ప్రేక్షకులు సినిమా కు బ్రహ్మరథం పట్టారు. మంచి వసూళ్లు ఫైటర్ సినిమాకు వస్తున్నట్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఫైటర్ సినిమా కి ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో హృతిక్‌ రోషన్ తదుపరి సినిమా వార్‌ 2 పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్నాయి. తాజాగా ఫైటర్ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్‌ తన తదుపరి సినిమా 'వార్‌ 2' పై స్పందించాడు.

హృతిక్ రోషన్‌.. ఇంకా వార్‌ 2 సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. త్వరలోనే ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాను అన్నాడు. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా మరోసారి హృతిక్‌ రోషన్ పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా వార్ 2 సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అందుకే వార్‌ 2 లో ఆయన పాత్ర ఎలా ఉంటుంది, ఆయన హృతిక్‌ రోషన్ కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. త్వరలోనే దేవర మొదటి పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది. ఆ వెంటనే వార్‌ 2 షూటింగ్ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇదే ఏడాదిలో సినిమా షూటింగ్‌ ప్రారంభించి 2025 వరకు వార్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.