Begin typing your search above and press return to search.

బెదురులంక దొంగోడే దొరగాడు..!

చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నిరూపించుకోవడానికి బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:50 AM GMT
బెదురులంక దొంగోడే దొరగాడు..!
X

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ, ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. నాని గ్యాంగ్ స్టర్ మూవీలో విలన్ గా కూడా నటించాడు. ఆ మూవీ క్లిక్ కాకపోయినా, కార్తీకేయ విలనిజం అందరికీ నచ్చింది. తమిళంలోనూ ఓ సినిమాలో అలరించి ఆకట్టుకున్నాడు. అయితే, చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నిరూపించుకోవడానికి బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ మూవీలో ముగ్గురు కీలక పాత్రదారులను ఈ పాటలో పరిచయం చేశారు. ఆ ముగ్గురు ఒక్కో దేవుడి పేరు చెప్పుకొని ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు అనే దానిని ఈ పాటలో చూపించారు. దొంగోడే దొరగాడు అంటే సాగే పాట విభిన్నంగా ఉంది.

ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. మణి శర్మ సంగీతం అంటే పాటలు అదిరిపోతాయి అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ టీం భావిస్తోంది.గతంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే పాట, ఆ పాట కూడా బాగానే క్లిక్ అయ్యింది.

ఇదిలా ఉండగా, ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. కానీ, విడుదలకు మాత్రం ఆలస్యమౌతూ వచ్చింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయిక కావడం విశేషం.

ఇక, ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే కొత్త తరహా డ్రామా ఫ్లస్ కామెడీ మూవీ అని తెలుస్తోంది. మరి ఈ మూవీ తో కార్తీకేయ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.