Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత స‌ల‌హా వ‌ల్లే న‌టిగా ఈ స్థాయిలో ఉన్నా

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటి దివ్యా దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 April 2026 1:56 PM IST
ఆ నిర్మాత స‌ల‌హా వ‌ల్లే న‌టిగా ఈ స్థాయిలో ఉన్నా
X

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటి దివ్యా దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె నటించిన చిరాయా వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ మంచి స్పందన అందుకుంటోంది. ఈ సిరీస్‌తో ఆమె తన నటనా ప్రయాణాన్ని కొత్త కోణంలో మళ్లీ నిర్వచించుకుంటూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా తన ప్రత్యేకతను చాటుతున్నారు.

దివ్యా కెరీర్ ను మార్చేసిన వీర్ రాజా

దివ్యా దత్తా కెరీర్‌ను పరిశీలిస్తే, అది సాధారణ ప్రయాణం కాదు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎదురుచూసిన ఆమెకు నిజమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది వీర్ జారా. ఈ సినిమా స‌క్సెస్ తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో గుర్తింపు పెరిగింది. అయితే, అదే సమయంలో వచ్చిన వరుస అవకాశాలు ఆమెను ఒక కీలక నిర్ణయం తీసుకునే దశకు తీసుకెళ్లాయి.

ఒకేసారి 20 సినిమాల‌కు సైన్

వీర్ జారా త‌ర్వాత దివ్య ద‌త్తాకు భారీ అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌గా వాటిలో ఏకంగా 20 సినిమాలకు సైన్ చేసిన దివ్యా, ఆ అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సందిగ్ధంలో పడిన‌ట్టు తెలిపారు. అప్పుడు ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఇచ్చిన సలహా ఆమె జీవితాన్ని మలిచిన‌ట్టు దివ్య వెల్ల‌డించారు. డబ్బు కోసమే సినిమాలు చేస్తావా? లేక మంచి నటిగా ఒక లెగసీని వదిలి వెళ్తావా? అని ఆదిత్య చోప్రా అడిగిన ప్రశ్న ఆమె ఆలోచనలను పూర్తిగా మార్చేసింది.

అడ్వాన్సుల‌ను తిరిగి ఇచ్చేసింది

ఆ ఒక్క మాట దివ్యా దత్తాను డేరింగ్ డెసిష‌న్ తీసుకునేలా చేసింది. దాంతోనే ఇంకా షూటింగ్ మొద‌ల‌వ‌ని సినిమాల అడ్వాన్స్‌లను తిరిగి ఇవ్వడం ద్వారా ఆమె తన కెరీర్‌ను కొత్త దిశలో మల‌చుకున్నారు. ఇది రిస్క్‌తో కూడుకున్న నిర్ణయమే అయినప్పటికీ, అదే ఆమెను నాణ్యమైన పాత్రల వైపు తీసుకెళ్లింది. ఆ తరువాత ఆమె ఎంచుకున్న సినిమాల‌ను దివ్య కెరీర్ ను పూర్తిగా రీడిఫైన్ చేయ‌డంతో ఆదిత్య చోప్రా స‌ల‌హా వ‌ల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. కమర్షియల్ స‌క్సెస్‌ల కంటే కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ఆమె, ప‌లు గొప్ప సినిమాల్లో న‌టించి త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇరాదా సినిమాకు ఆమెకు లభించిన నేష‌న‌ల్ అవార్డు, ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో నిరూపించింది.

దివ్యా దత్తా ప్రయాణం కేవలం ఒక నటిగా ఎదగడం మాత్రమే కాదు, తనను తాను అర్థం చేసుకుని తీసుకున్న నిర్ణయాల ఫలితం కూడా. స్ట్రగుల్ నుంచి సెల్ఫ్ రియలైజేషన్ వరకు ఆమె సాగించిన ఈ ప్రయాణం కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వారికి ఒక పెద్ద పాఠంగా నిలుస్తోంది. ఇప్పుడు చిరాయాతో ఓటీటీ ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్న దివ్యా, మంచి కథలు ఎంచుకుంటే ఒక న‌టి కెరీర్ ఎలా మారుతుందో మరోసారి నిరూపిస్తోంది. డబ్బు కన్నా లెగసీ ముఖ్యమనే విషయాన్ని గుర్తుచేస్తూ, దివ్య ద‌త్తా జ‌ర్నీ కొత్త తరానికి ప్రేరణగా నిలుస్తోంది.